ETV Bharat / city

ఆన్‌లైన్‌ పాఠాలు మొదలు పెట్టే యోచనలో తెలంగాణ ప్రభుత్వం

author img

By

Published : May 24, 2021, 11:10 AM IST

కరోనా మహమ్మారి విద్యా వ్యవస్థను అతలాకుతలం చేసింది. సాఫీగా సాగిపోయే తరగతుల్లో కలకలం రేపి విద్యార్థులను పాఠశాలలకు దూరం చేసింది. వాటికి ప్రత్యామ్నాయంగా ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఎన్నో యోచనలు చేసింది. కొంత వరకు సఫలీకృతం అయినా చిన్న చిన్న లోపాలతో మళ్లీ పరిస్థితి మొదటికొచ్చింది. ఈ నేపథ్యంలో గతంలోని లోపాలను సరిదిద్దుకొని డిజిటల్‌ తరగతులు మళ్లీ ప్రారంభించాలని విద్యాశాఖ యోచిస్తోంది.

educational  department
తెలంగాణ విద్యాాశాఖ

వచ్చే విద్యా సంవత్సరం(2021-2022) పాఠశాలలు తెరిచి ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టే పరిస్థితి వచ్చే వరకు ఆన్‌లైన్‌ పాఠాలను మరింత పకడ్బందీగా కొనసాగించాలని తెలంగాణ విద్యాశాఖ భావిస్తోంది. గత ఏడాది అనుభవాలు, లోటుపాట్లను సరిదిద్దుకొని మెరుగ్గా ఆన్‌లైన్‌ విద్యను ముందుకు తీసుకెళ్లేందుకు సంసిద్ధమవుతోంది. గత విద్యా సంవత్సరం(2020-21) సెప్టెంబరు 1 నుంచి ఆన్‌లైన్‌ విద్యను ప్రారంభించారు.

కరోనా సద్దుమణిగి ప్రత్యక్ష తరగతులు మొదలుపెట్టొచ్చని ఎదురుచూస్తూ చివరకు ఇక లాభం లేదని ఆలస్యంగా డిజిటల్‌ పాఠాలకు శ్రీకారం చుట్టారు. ఈసారి ప్రత్యక్ష తరగతులకోసం ఎదురుచూడకుండా ఆన్‌లైన్‌ పాఠాలను జూన్‌ నెలాఖరు లేదా జులై నుంచి ప్రారంభించాలని యోచిస్తున్నారు. గత ఏడాది తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 3-10 తరగతులకు కలిపి దాదాపు 2 వేల ఆన్‌లైన్‌ పాఠాలను పాఠశాల విద్యాశాఖలోని రాష్ట్ర విద్యా సాంకేతిక సంస్థ(సైట్‌) రూపొందించింది. వాటిని టీవీల ద్వారా ప్రసారం చేశారు. సిలబస్‌లో 30 శాతం తగ్గించినందున వాటికి సంబంధించిన అంశాలపై మరో 700 వరకు పాఠాలను రికార్డు చేయాల్సి ఉంటుందని అధికారి ఒకరు తెలిపారు.

కేంద్రం ఏం చెప్పిందంటే...

ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ అన్ని రాష్ట్రాల విద్యాశాఖ కార్యదర్శులతో సమావేశమై కొవిడ్‌ కాలంలో ఆన్‌లైన్‌ విద్యను ఎలా ముందుకు తీసుకెళ్లాలన్న అంశంపై చర్చించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి రాష్ట్రాలు ఆన్‌లైన్‌ విద్యను అందించేందుకు సొంతగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. పిల్లల్లో విద్యా అభ్యసనాల అంచనాకు కొత్త విధానాలు తయారుచేయాలని ఆదేశించారు. ఈ నెలాఖరు వరకు వేసవి సెలవులు ఉన్నందున జూన్‌ మొదటి వారంలో విద్యాశాఖ విద్యా క్యాలెండర్‌పై చర్చించనుంది.

గత ఏడాది లోపాలు ఇలా...

గత విద్యా సంవత్సరం సెప్టెంబరు 1 నుంచి డిజిటల్‌ పాఠాలను మొదలుపెట్టగా తొలి నెలలో విద్యార్థులు బాగానే విన్నారు. తర్వాత గాడి తప్పింది. అక్టోబరు నుంచి పంట ఉత్పత్తులు రావడం మొదలైంది. పిల్లలు కూలి పనులకు, సొంత వ్యవసాయ పనులకు వెళ్లారు. దానికితోడు కొందరికి ఇళ్లలో టీవీలు లేవు. ఇంకొందరికి ఆ పాఠాలను చూసేందుకు వీలైన మొబైల్‌ ఫోన్లు లేవు. ఉన్నా సిగ్నల్‌ సమస్య లాంటివి ఉత్పన్నమయ్యాయి. వర్క్‌షీట్లు అవి రూపొందించినా విద్యార్థులకు చేరలేదు. ఒక నెల తర్వాత విద్యాశాఖ పర్యవేక్షణ కూడా లోపించింది. ఫలితంగా ఆన్‌లైన్‌ విద్య ఆశించిన ఫలితాలను ఇవ్వలేదన్న అభిప్రాయం ఉంది. ‘గత ఏడాది ఆన్‌లైన్‌ విద్యలో భాగంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సప్‌ ద్వారా వివిధ సబ్జెక్టులపై అవగాహనను పరీక్షించే చాట్‌బాట్‌ లాంటి పలు విధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రశంసించింది. వచ్చే ఏడాది మరింత పకడ్బందీగా అమలు చేస్తాం’ అని పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన అన్నారు.

ఇదీ చదవండి:

ప్రాజెక్ట్‌ మదద్‌.. కరోనా పల్లెలకు అండగా ప్రవాసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.