ETV Bharat / city

TS EAMCET RESULTS: బుధవారం విడుదల కానున్న తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు - తెలంగాణ వార్తలు

తెలంగాణ ఎంసెట్‌(TS EAMCET RESULTS) ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) ఫలితాలు వెల్లడించనున్నారు.

తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు
తెలంగాణ ఎంసెట్ ఇంజినీరింగ్ ఫలితాలు
author img

By

Published : Aug 24, 2021, 7:33 PM IST

తెలంగాణ ఎంసెట్‌(TS EAMCET RESULTS) ఇంజినీరింగ్‌ ఫలితాలు విడుదల కానున్నాయి. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి(SABITHA INDRA REDDY) ఫలితాలు వెల్లడించనున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీల్లో ఇంజినీరింగ్ ఎంసెట్ నిర్వహించారు. ఈ నెల 25న ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ ఫలితాలు వెల్లడించనున్నట్లు ఉన్నత విద్యా మండలి గతంలోనే ప్రకటించిన నేపథ్యంలో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ను ఈ నెల 10న విడుదల చేశారు. రాష్ట్ర సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ప్రవేశాల కమిటీ సభ్యులు సమావేశమై షెడ్యూలు ఖరారు చేశారు. వ్యవసాయ, ఫార్మా ఎంసెట్ ఫలితాలను తర్వాత వెల్లడించనున్నారు.

ఇంజినీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ఈనెల 30న ప్రారంభం కానుంది. ఈ నెల 30 నుంచి సెప్టెంబరు 9వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో రుసుము చెల్లించి ధ్రువపత్రాల పరిశీలనకు స్లాట్ బుక్‌ చేసుకోవాలి. సెప్టెంబరు 4 నుంచి 11 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ ఉంటుంది. సెప్టెంబరు 4 నుంచి 13 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం కల్పిస్తారు. సెప్టెంబరు 15న ఇంజినీరింగ్ మొదటి విడత సీట్లను కేటాయిస్తారు. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు విద్యార్థులు ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో విడత కౌన్సెలింగ్ తేదీలను త్వరలోనే వెల్లడిస్తామని నవీన్ మిత్తల్ తెలిపారు.

ఇదీ చదవండి: చింతపల్లిలో అల్లూరి స్మారక పోస్టల్ కవర్ ఆవిష్కరణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.