ETV Bharat / city

TS TRS MLC candidates for MLA quota : ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే

తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలకు తెరాస అభ్యర్థులు ఖరారయ్యారు. ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది.

TRS
TRS
author img

By

Published : Nov 16, 2021, 12:57 PM IST

TRS MLC candidates for MLA quota
ఎమ్మెల్యే కోటా తెరాస ఎమ్మెల్సీ అభ్యర్థులు

తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ తెరాస అభ్యర్థులు(TRS MLC candidates for MLA quota) ఖరారయ్యారు. ఆరు స్థానాలకు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా బండా ప్రకాశ్, వెంకట్రామిరెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్‌రావు, కౌశిక్‌రెడ్డి, కడియం శ్రీహరి పేర్లను అధిష్ఠానం ప్రకటించింది. ఎన్నికలకు నేటితో నామినేషన్లు ముగియనుండగా అభ్యర్థులు నామపత్రాలు దాఖలు చేయనున్నారు. అభ్యర్థులంతా అసెంబ్లీకి చేరుకున్నారు.

జాబితాలో చివరి నిమిషంలో బండా ప్రకాశ్‌, వెంకట్రామ్ రెడ్డి పేర్లు ఖరారయ్యాయి. ఆరు స్థానాల్లో ఎన్నిక లాంఛనం కానుంది. ఈటల సామాజిక వర్గానికి చెందిన బండా ప్రకాశ్‌కు మంత్రి పదవి దక్కనుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

అభ్యర్థుల ఎంపిక కోసం భారీ కసరత్తే జరిగింది. జాబితాలో ఆకుల లలిత కొనసాగింపుతో పాటు మధుసూధనాచారికి అవకాశం లభిస్తుందనే ఊహాగానాలు రాగా.. చివరి నిమిషంలో అంతా తారుమారైంది. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌కు ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. సిద్దిపేట కలెక్టర్‌(siddipet former collector)గా స్వచ్ఛంద పదవీ విరమణ చేసిన వెంకట్రామిరెడ్డిని పెద్దల సభకు పంపిచాలని తెరాస నిర్ణయించింది.

పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీకి నామినేట్‌ చేసినా.. ఆ దస్త్రం గవర్నర్‌ వద్ద పెండింగ్‌లో ఉంది. ఆయన చేసిన సామాజిక సేవ పరిశీలించాలని గవర్నర్‌ ప్రకటించారు. ఈ పరిణామాలతో కౌశిక్‌రెడ్డి(Paadi Kaushik reddy)ని శాసనసభ్యుల కోటాలో మండలికి పంపించాలని గులాబీ అధినేత నిర్ణయించారు.

  • ఇదీ చదవండి :

కొనసాగుతున్న.. పరిషత్ ఎన్నికల పోలింగ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.