ఈనెల 26న మధ్యాహ్నం 2.15 గంటలకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం రాజధాని వ్యాజ్యాలపై విచారణ జరపనుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ జోయ్ మల్వబాగ్చి, జస్టిస్ ఎన్.జయసూర్యతో కూడిన త్రిసభ్య ధర్మాసనం వాజ్యాలను విచారించనుంది. అప్పటి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం.. పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాలను సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై విచారణ జరిపింది.
జస్టిస్ మహేశ్వరీ బదిలీతో ఆ వ్యాజ్యాలపై విచారణ నిలిచిపోయింది. తాజాగా హైకోర్టు విడుదల చేసిన రోస్టర్ ప్రకారం... ఈ నెల 26న త్రిసభ్య ధర్మాసనం విచారణకు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ ఏజీ రాజధాని వ్యాజ్యాల్ని విచారించాలని కోరుతూ... హైకోర్టుకు లేఖ రాసినట్లు సమాచారం. హైకోర్టు సీజే రోస్టర్‌లో మార్పులు చేయడంలో న్యాయమూర్తులు విచారించే వ్యాజ్యాల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.
ఇదీ చదవండీ... ప్రైవేట్ సంస్థ చేతికి... ఇసుక రీచ్‌ల్లో తవ్వకాల బాధ్యత