ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో వచ్చే ఏడాది రామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి వెల్లడించారు. కొవిడ్‌ను అరికట్టడంలో ప్రభుత్వాల ఆదేశాలను ప్రతి ఒక్కరూ పాటించాలని సూచించారు. కరోనా మహమ్మారి అంతమై ప్రజలంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. త్రిదండి చినజీయర్ స్వామివారి తిరు నక్షత్ర మహోత్సవంలో భాగంగా ప్రతి ఏటా ఆవార్డులు ఇస్తున్నట్లు రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్‌లో జరిగిన కార్యక్రమంలో తెలిపారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు జరిగే స్వర్ణమయ శ్రీ రామానుజ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కొవింద్, ప్రధాని మోదీ, పలువురు ప్రుముఖులు హాజరు కానున్నారని వెల్లడించారు. 1994 నుంచి జీయర్ పురస్కారాలు ప్రదానం చేస్తున్నట్లు తెలిపిన ఆయన.. ఈ ఏడాది దిల్లీ వాస్తవ్యులు బ్రహ్మశ్రీ గోపాల ప్రసాద శర్మకు అందించారు. ప్రతి దీపావళికి వేదాల్లో కృషి చేసిన వారిని, వేదాల్లో అనుభవం గడించిన వారిని జీయర్ అవార్డ్ పేరిట సన్మానిస్తున్నట్లు త్రిదండి చినజీయర్ స్వామి తెలిపారు.
ఇదీ చూడండి: