రాష్ట్రంలో ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పల్లెవెలుగు, సిటీ సర్వీసుల్లో కి.మీ.కు 10 పైసలు, మిగతా బస్సుల్లో కి.మీ.కు 20 పైసలు పెంచినట్లు ప్రకటించింది. బస్సు ఛార్జీల పెంపును సీఎం జగన్ ఆమోదించినట్లు.. రవాణాశాఖ మంత్రి పేర్ని నాని తెలిపారు. నష్టాల ఊబి నుంచి ఆర్టీసీని గట్టెక్కించాలంటే పెంపు తప్పదని మంత్రి స్పష్టం చేశారు. ఆర్టీసీ రూ.6,500 కోట్ల నష్టాల్లో ఉందన్న మంత్రి...ఛార్జీలు పెంచకపోతే సంస్థ దివాళా తీసే పరిస్థితి ఉందన్నారు. ఆర్టీసీని బతికించాలన్నదే ఛార్జీల పెంపు ఉద్దేశం మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు అమలు తేదీని రెండ్రోజుల్లో ఆర్టీసీ ఎండీ ప్రకటిస్తారన్నారు. నాలుగేళ్ల తర్వాత ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని మంత్రి తెలిపారు.
ఆర్టీసీ బస్సుల ప్రస్తుత ఛార్జీలు
సర్వీసులు | కి.మీకు ఛార్జీలు |
సిటీ బస్సులు | 78 పైసలు |
పల్లెవెలుగు | 63 పైసలు |
ఎక్స్‌ప్రెస్‌లు | 87 పైసలు |
సూపర్ లగ్జరీ | రూ.1.16 |
ఇంద్ర | రూ.1.45 |
గరుడ | రూ.1.71 |
అమరావతి | రూ.1.91 |
ఇదీ చదవండి :