ETV Bharat / city

Revanth fire on CM KCR: 'తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా కేసీఆర్​ నిర్ణయాలు' - Revanth reddy comments on 317 GO

Revanth fire on CM KCR: కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లకుండా.. పోలీసులు నిర్బంధించడాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. తామేమైనా సీఎం కేసీఆర్ ఆస్తులు లాక్కోవడానికి వెళ్తున్నామా? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వ మొండి వైఖరితో.. ఉపాధ్యాయులు, రైతులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆరోపించారు.

Revanth fire on CM KCR
Revanth fire on CM KCR
author img

By

Published : Dec 31, 2021, 5:21 PM IST

Revanth fire on CM KCR: తెలంగాణలో పాలనను పూర్తిగా నిర్వీర్యం చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లకుండా.. పోలీసులు నిర్బంధించడాన్ని రేవంత్​రెడ్డి తీవ్రంగా ఖండించారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. ప్రభుత్వం మొండిగా 317 జీవో తీసుకురావటం వల్ల.. ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారని తెలిపారు. ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు.

మానవతా దృక్పథంతో ఆలోచించట్లేదు...

స్థానికతపైనే గతంలో పెద్ద ఉద్యమం జరిగిందని రేవంత్​రెడ్డి గుర్తుచేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తెచ్చిందన్నారు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇష్టానుసారం జిల్లాలను విభజించారని ఆరోపించారు. ప్రభుత్వ చర్యలతో దివ్యాంగ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. స్థానికత ఆధారంగా కేటాయించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారని తెలిపారు. మానవతా దృక్పథంతో ఆలోచించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదని దుయ్యబట్టారు.

ఆస్తులు లాక్కోడానికి వెళ్తున్నామా..?

"పోలీసులు మా ఇళ్లలోకి చొరబడి మమ్మల్ని నిర్బంధిస్తున్నారు. కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌కు వెళ్లకుండా మమ్మల్ని నిర్బంధించారు. మేం ఏమైనా కేసీఆర్ ఆస్తులు లాక్కోవడానికి వెళ్తున్నామా? రైతులు ఆత్మహత్య చేసుకునేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రైతులు వరి వేయకుండా నిషేధించారు. సీఎం కేసీఆర్ మాత్రం తన ఫామ్‌హౌస్‌లో వరి సాగు చేశారు. స్థానికత ఆధారంగా ఉద్యోగావకాశాలు కల్పించాలని కాంగ్రెస్ ప్రభుత్వం జీవో తెచ్చింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇష్టానుసారం జిల్లాలను విభజించారు. స్థానికతపైనే గతంలో పెద్ద ఉద్యమం జరిగింది. స్థానికత ఆధారంగా కేటాయించాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి విరుద్ధంగా, రాజ్యాంగానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వం మొండిగా 317 జీవో తీసుకొచ్చింది. ఉపాధ్యాయులు రోడ్లు ఎక్కి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేయాల్సిన పరిస్థితి దాపురించింది. ప్రభుత్వ చర్యలతో ఉపాధ్యాయులు మానసిక వేదనకు గురవుతున్నారు. మానవతా దృక్పథంలో ఆలోచించాలని కోరినా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు." - రేవంత్​రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు

ఇదీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.