ETV Bharat / city

Torn Currency Notes on The Road: రోడ్డుపై కుప్పలు తెప్పలుగా కరెన్సీ నోట్ల తుక్కు

Torn Currency Notes on The Road : తెలంగాణ రాష్ట్రంలో చిరిగిన కరెన్సీ నోట్లు రోడ్డుపై కుప్పలు కుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. హైదరాబాద్​-నాగ్​పుర్ జాతీయ రహదారిపై కనిపించిన నోట్ల తుక్కు.. అసలైన నోట్లవా.. లేక నకిలీవా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారనే అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ ఫుటేజీ ఆధారాలతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Torn Currency
Torn Currency
author img

By

Published : Dec 30, 2021, 8:57 AM IST

Torn Currency Notes on The Road : తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్‌ జిల్లా మెండోరా మండలం బుస్సాపూర్‌ వద్ద హైదరాబాద్‌-నాగ్‌పుర్‌ జాతీయ రహదారిపై బుధవారం చిరిగిన కరెన్సీ (నోట్ల తుక్కు) కుప్పలుకుప్పలుగా కనిపించడం కలకలం రేపింది. లారీ నుంచి కింద పడిన సంచి పైనుంచి వాహనాలు వెళ్లడంతో తుక్కు రోడ్డుపై చెల్లాచెదురుగా పడినట్టు స్థానికులు చెబుతున్నారు. అవి అసలైనవా? నకిలీ నోట్లా? అసలైనవైతే తుక్కుగా ఎందుకు మార్చారు? ఎక్కడికి తరలిస్తున్నారు? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఆర్బీఐ అలా చేయదు..

Torn Currency Notes in Nizamabad : స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ‘సాధారణంగా ఆర్‌బీఐ పాత నోట్లను ధ్వంసం చేసే క్రమంలో రహస్య ప్రదేశంలో కాల్చేస్తుంది తప్ప ఇలా తరలించదు. దీన్నిబట్టి అది నల్లధనమో లేదా నకిలీ నోట్లో అయ్యే అవకాశం ఉంది. ఏ వాహనం నుంచి అవి జారిపడ్డాయో తెలుసుకునేందుకు సీసీటీవీ పుటేజీలు పరిశీలిస్తున్నాం’ అని ఓ పోలీస్‌ ఉన్నతాధికారి వెల్లడించారు.

ఇదీ చదవండి :

Distribution increased pension: జనవరి 1 నుంచి పెంచిన పింఛను

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.