ETV Bharat / city

AP TOP NEWS: ప్రధానవార్తలు @7AM

.

ప్రధానవార్తలు
ప్రధానవార్తలు
author img

By

Published : Aug 4, 2022, 6:46 AM IST

  • Food in schools: గాడి తప్పిన మేనమామ మెనూ.. పిల్లల ఆహారంలో కోతలే కోతలు
    పాఠశాలల్లో, వసతి గృహాల్లో పిల్లలకు అందించే భోజనం విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పిల్లలకిచ్చే ఆహార మెనూ గాడి తప్పింది. గత మూడేళ్లలో నిత్యావసరాల ధరలు నింగినంటి... పిల్లల ఆహారంలో కోత పడుతున్నా ఎందుకు పట్టించుకోవట్లేదు? వారిని మేనమామలా చూసుకుంటానని చెప్పి.. డైట్‌ ఛార్జీలను పెంచాలన్న ఆలోచన ఎందుకు రావట్లేదనే ప్రశ్నలు తల్లిదండ్రుల నుంచి వినిపిస్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • botsa on schools: ఇంటి పక్కనే పాఠశాల ఉండాలంటే ఎలా?: బొత్స
    పాఠశాలల విలీనంపై విద్యాశాఖ మంత్రి బొత్స కీలక వ్యాఖ్యలు చేశారు. విలీనాన్ని కేవలం కొద్ది మంది మాత్రమే వ్యతిరేకిస్తున్నారని అన్నారు. ఇంటి పక్కనే బడి ఉండాలంటే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు. ఏదైనా చట్టం చేసే ముందు ప్రజాభిప్రాయం తీసుకోం కదా! అని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • Central on mining: ఏపీలో మైనింగ్‌ అక్రమాలు.. నిగ్గు తేల్చేందుకు కేంద్రం ఆదేశం
    ఆంధ్రప్రదేశ్‌లోని బీచ్‌ శాండ్‌ మినరల్స్‌ మైనింగ్‌లో జరిగిన అక్రమాలు నిగ్గు తేల్చేందుకు కేంద్ర ప్రభుత్వం విచాణకు ఆదేశించింది. పర్యావరణ కాలుష్యం, మైనింగ్‌ చట్టాల ఉల్లంఘన, మోనోజైట్‌ అక్రమ ఎగుమతులపై కేంద్ర గనులశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్టు కేంద్ర అణు ఇంధన శాఖ పార్లమెంట్‌కు తెలిపింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీ ఘటన.. విచారణకు కమిటీ నియమించిన ఎన్జీటీ
    సీడ్స్‌ కంపెనీలో విషవాయువు లీకేజీపై విచారణకు.. ఆరుగురు సభ్యులతో జాతీయ హరిత ట్రైబ్యునల్‌ కమిటీ నియమించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ డైరెక్టర్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. నోడల్‌ ఎజన్సీగా కాలుష్య నియంత్రణ మండలి ఉంటుందని తెలిపింది. 2 వారాల్లో మధ్యంతర నివేదిక ఇవ్వాలని.. చర్యలపై తుది నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • దీదీ సర్కార్​ దిద్దుబాటు చర్యలు.. కేబినెట్​ పునర్​వ్యవస్థీకరణ.. బాబుల్​ సుప్రియోకు చోటు
    పశ్చిమ్​ బంగాలోని మమతా బెనర్జీ ప్రభుత్వం.. కేబినెట్​ను పునర్​వ్యవస్థీకరించింది. భాజపాకు చెందిన కేంద్ర మాజీ మంత్రి, గతేడాది టీఎంసీలో చేరిన బాబుల్​ సుప్రియో సహా ఐదుగురు కొత్తవారికి మంత్రులుగా చోటు కల్పించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • నదిలో చిక్కుకున్న మహిళ, మూడేళ్ల చిన్నారి.. భారీ వరద ప్రవాహంలో గంటలపాటు..
    ఒడిశా రాయగడలో ఓ మహిళ తన మూడేళ్ల పాపతో సహా నదిలో చిక్కుకుపోయింది. సదర్​ పరిధిలోని కుంభికోటలో ఓ మహిళ తన మూడేళ్ల చిన్నారితో కలిసి నది దాటుతోంది. ఈ క్రమంలోనే నదీ ప్రవాహం అధికమవడం వల్ల మధ్యలోనే చిక్కుకుపోయింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • nancy pelosi: తైవాన్ వీడిన పెలోసీ.. అమెరికాను వదిలే ప్రసక్తే లేదన్న చైనా
    యావత్‌ ప్రపంచానికి ఉత్కంఠ రేపిన అమెరికా ప్రతినిధుల సభ స్పీకర్‌ నాన్సీ పెలోసీ తైవాన్‌ పర్యటన ఎట్టకేలకు ముగిసింది. చైనా హెచ్చరికలు బేఖాతరు చేస్తూ నిన్న రాత్రి ఆ దేశ రాజధాని తైపేలో అడుగుపెట్టిన పెలోసీ.. ఈ ఉదయం తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి యింగ్‌ వెన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఆమె.. సాయంత్రం తైపీ నుంచి దక్షిణకొరియా బయల్దేరారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • 5జీ సేవలపై ఎయిర్‌టెల్‌ కీలక ప్రకటన.. వొడాఫోన్​ ఐడియాకు భారీ నష్టం
    5జీ సేవలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది ప్రముఖ టెలికాం సంస్థ ఎయిర్‌టెల్‌. ఆగస్టు నెలలోనే 5జీ సేవలను తీసుకొస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టెలికాం కంపెనీ వొడాఫోన్‌ ఐడియా.. తొలి త్రైమాసిక ఫలితాల్లో నష్టాలను ప్రకటించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో 'మా' భేటీ.. వాటి లెక్క తేలాకే షూటింగ్స్​ షురూ!
    నిర్మాతలు ఆగస్టు 1నుంచి సినిమా షూటింగ్స్ నిలిపివేసిన నేపథ్యంలో ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌తో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) బుధవారం భేటీ అయ్యింది. తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న పలు సమస్యలపై చర్చ జరిగింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
  • womens cricket: సెమీస్​కు దూసుకెళ్లిన టీమ్​ఇండియా.. బార్బడోస్​పై భారీ విజయం
    బర్మింగ్​హమ్​లో జరుగుతున్న కామన్​వెల్త్​ గేమ్స్​లో మహిళల క్రికెట్ టీమ్ సెమీస్​కు దూసుకెళ్లింది. కీలక మ్యాచ్​లో అద్భుతంగా రాణించింది. బ్యాటింగ్‌లో రోడ్రిగ్స్‌ (56* నాటౌట్‌; 46 బంతుల్లో 6x4, 1x6), బౌలింగ్‌లో రేణుకా సింగ్ 4/10 విజృంభించిన వేళ భారత్‌ 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.