- ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు కేంద్రమంత్రులు.. స్టూడెంట్స్‌ను త్వరగా తరలించేందుకే..
ఉక్రెయిన్- రష్యా యుద్ధం తీవ్రతరమవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న వేలాది మంది భారతీయులను స్వదేశానికి తరలించే ప్రక్రియను వేగవంతం చేసే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నలుగురు కేంద్ర మంత్రులను ఉక్రెయిన్ సరిహద్దు దేశాలకు పంపాలని నిర్ణయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రష్యా దాడిలో ఆరేళ్ల చిన్నారి మృతి.. కొన ఊపిరితో తండ్రి
ఉక్రెయిన్‌పై రష్యా దాడిలో సామాన్యులు సమిధలవుతున్నారు. రష్యా బలగాలు జరుపుతున్న కాల్పుల్లో చిన్నారులు, వృద్ధులు మరణిస్తున్నారు. మారియుపోల్‌లో ఆరేళ్ల చిన్నారి తీవ్ర గాయాలకు గురై మరణించడం అందరి హృదయాలను ద్రవింప జేస్తోంది. ఆ చిన్నారి మరణంతో వైద్య సిబ్బంది కూడా కన్నీటిపర్యంతమయ్యారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CM JAGAN: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే లక్ష్యం: సీఎం జగన్
CM JAGAN: చిరు వ్యాపారులకు అండగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పాదయాత్రలో చిరువ్యాపారుల కష్టాలు చూశానన్న సీఎం.. వారికి అండగా నిలవడానికే 'జగనన్న తోడు' పథకం తీసుకువచ్చినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Lokesh at Visakha: పరువు నష్టం కేసు.. విశాఖ కోర్టుకు నారా లోకేశ్
తెదేపా నేత నారా లోకేశ్ విశాఖ కోర్టుకు హాజరయ్యారు. తనపై అసత్యాలు ప్రచురించారని సాక్షి పత్రికపై లోకేశ్ పిటిషన్ వేయగా.. ఆ కేసు ఇవాళ్టీకి వాయిదా పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉక్రెయిన్‌లోనే పశ్చిమగోదావరి విద్యార్థి.. ఆందోళనలో తల్లిదండ్రులు
ఉక్రెయిన్‌లో ప్రస్తుతం నెలకొన్న యుద్ధ వాతావరణంతో.. అక్కడ చిక్కుకున్న తెలుగు వారి బాధలు వర్ణనాతీతం. తిండి తిప్పలు లేకపోయినా కనీసం ప్రాణాలతో బయటపడితే చాలన్న రీతిలో బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు పశ్చిమగోదావరికి చెందిన విద్యార్థులు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- PM Modi: 'ఆధునిక మౌలిక సదుపాయాల అభివృద్ధిలో అదే కీలకం'
భారత్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడంలో పీఎం గతి శక్తి ప్లాన్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వివిధ శాఖల మధ్య సమన్వయం నెలకొల్పడం ద్వారా వివాదాలకు తావులేకుండా ఉంటుంది అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- కన్నబిడ్డపై తల్లి కర్కశత్వం.. చితకబాది, లాగి బయట పడేసి..
మధ్యప్రదేశ్ జునా పట్టణంలో దారుణం జరిగింది. కన్నబిడ్డపైనే తల్లి కర్కశత్వం ప్రదర్శించింది. ఏడాదిన్నర చిన్నారిని చితకబాది.. లాగి ఇంటి బయట పడేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కుమారుడు.. దిగులుతో ఆగిన తల్లి గుండె
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న కుమారుడి కష్టాలు చూసి ఓ తల్లి గుండె ఆగింది. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. బిడ్డ పరిస్థితిని తలచుకుని మరింత కుంగిపోయింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలిసి కుమారుడు శోకసంద్రంలో మునిగిపోయాడు. వీడియో కాల్లో తల్లి భౌతికకాయాన్ని చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పంజాబ్ కింగ్స్ కొత్త కెప్టెన్‌గా మయాంక్.. అధికార ప్రకటన
భారత బ్యాటర్ మయాంక్ అగర్వాల్‌ను కెప్టెన్‌గా నియమించింది పంజాబ్ కింగ్స్. సోషల్‌మీడియా ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'భీమ్లా నాయక్' వసూళ్ల మేనియా.. మూడురోజుల్లో రూ.100 కోట్లు
బాక్సాఫీసు దగ్గర 'భీమ్లా నాయక్' హవా కనిపిస్తోంది. ఓ వైపు ప్రేక్షకుల్ని అలరిస్తున్న ఈ సినిమా.. మరోవైపు వసూళ్లు కూడా అదే స్థాయిలో సొంతం చేసుకుంటోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి