- జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ- జవాన్లతో కలిసి దీపావళి వేడుకలు
జవాన్లతో కలిసి దీపావళి జరుపుకునేందుకు ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్ రాజౌరి జిల్లాలోని నౌషెర సెక్టార్‌కు చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- మూడు రోజులుగా జోరువానలు
అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో మూడు రోజులుగా జోరువాన(heavy rains) కురుస్తోంది. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు నీటమునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లల్లోకి వరద నీరు చేరి అవస్థలు పడుతున్నారు. ఈదురుగాలులకు వరిపంట పూర్తిగా దెబ్బతింది. కొన్ని ప్రాంతాల్లో రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వంశధారపై ఒడిశా పిటిషన్ కొట్టేయండి..సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్
నేరడి బ్యారేజీకి సంబంధించి వంశధార జల వివాదాల ట్రైబ్యునల్ (వీడబ్ల్యూడీటీ) ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఒడిశా దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలని సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- వృద్ధిలో ఏపీ పదకొండో స్థానం
వనరులు, మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి రంగాల్లో వృద్ధి పథంలో సాగుతున్న రాష్ట్రాల్లో ఏపీ పదకొండో స్థానంలో నిలిచింది. రాష్ట్రాల పని తీరు ఆధారంగా పీఏసీ 2021 సంవత్సరానికి నివేదిక ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రైలు కిందపడి వైకాపా నాయకుడు ఆత్మహత్య...ఎందుకంటే..!
పుట్టపర్తిలో దారుణం జరిగింది. మున్సిపల్ కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ ఆదాం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రజినీపై అభిమానం.. 'అన్నాత్తె' విడుదల వేళ రూ.1కే దోశ
సూపర్‌స్టార్ రజినీకాంత్‌పై అభిమానాన్ని తమిళనాడు తిరుచ్చికి చెందిన ఓ హోటల్ యజమాని వినూత్నంగా చాటుకున్నారు. అన్నాత్తె సినిమా(rajinikanth new movie) విడుదల సందర్భంగా కేవలం రూపాయికే దోశ అందిస్తున్నారు. హోటల్ పేరు సైతం అన్నమలైగా పెట్టటం గమనార్హం. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- అప్పుడు కుస్తీ.. ఇప్పుడు దోస్తీ: బాబాయ్ పార్టీతో పొత్తుకు అఖిలేశ్ రెడీ
ఉత్తర్‌ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోనని సంచలన ప్రకటన చేసిన సమాజ్ వాదీ పార్టీ అధినేత, ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (akhilesh yadav news) మరో కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో బాబాయ్ శివపాల్ యాదవ్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రష్యాలో కూలిన విమానం- ఏడుగురు మృతి
రష్యాలో బెలారస్‌కు చెందిన కార్గో విమానం కూలిపోయింది. ఈ ఘటనల ఏడుగురు మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సచిన్ దాతృత్వం.. ఆస్పత్రికి వైద్య పరికరాలు సాయం
క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్(Sachin News) మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. తన సేవా సంస్థ ద్వారా అసోం కరీమ్గంజ్ జిల్లా ఆస్పత్రికి రెటినాల్ కెమెరాలు సాయంగా అందించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'అఖండ' టైటిల్ సాంగ్ టీజర్ అదిరింది!
నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను(balayya boyapati movies) దర్శకత్వం వహిస్తున్న చిత్రం 'అఖండ'. తాజాగా దీపావళి పురస్కరించుకుని ఈ చిత్ర టైటిల్ సాంగ్ టీజర్(akhanda title song)ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ నెల 8న పూర్తి పాటను రిలీజ్ చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి