ETV Bharat / city

TOP NEWS: ప్రధానవార్తలు @ 7 AM

.

author img

By

Published : Jul 7, 2022, 6:59 AM IST

TOP NEWS
ప్రధానవార్తలు
  • నేడు, రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
    సీఎం జగన్ నేడు, రేపు వైఎస్సాఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న సీఎం జగన్.. పర్యటన అనంతరం విజయవాడ చేరుకుని నాగార్జున యూనివర్శిటీ ఎదురుగా జరిగే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీలో పాల్గొననున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫసల్‌ బీమా యోజన పథకంలో ఏపీ సర్కారు భాగస్వామ్యం
    రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వైఎస్​ఆర్​ బీమాను కేంద్ర ఫసల్​ బీమా యోజనాతో భాగస్వామ్యం చేయాలని ముఖ్యమంత్రి వైఎస్​ జగన్​ నిర్ణయించారు. కేంద్ర వ్యవసాయ శాఖ కార్యదర్శి సహా అధికారుల బృందంతో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • చదువు గందరగోళం.. విలీనంతో తగ్గిపోనున్న బడులు, ఉపాధ్యాయ పోస్టులు
    పాఠశాలలను విలీనం చేయాలన్న ప్రభుత్వం నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ నిర్ణయం పిల్లల చదువులపై ప్రభావం చూపిస్తుందని.. పాఠశాలల దూరం పెరిగితే చదువు మానేసే వారి సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు ఈ నిర్ణయం వల్ల ఉపాధ్యాయుల పోస్టులు కూడా తగ్గిపోతాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మట్టి మింగేస్తున్నారు.. అడ్డుకుంటే దాడులు.. ఫిర్యాదు చేస్తే అంతుచూస్తామని బెదిరింపులు!
    కొండల్ని పిండి చేస్తున్నారు.. చెరువుల్ని చెరబడుతున్నారు.. కాలువ కట్టల్నీ కొల్లగొడుతున్నారు.. ఖాళీ భూమి కనిపిస్తే పాగా వేసేస్తున్నారు. మట్టి, గ్రావెల్‌, కంకర నుంచి వందల కోట్ల రూపాయలు పిండుకుంటున్నారు. మట్టి దొరికితే మేసేయడమే. కంకర కనిపిస్తే తోడేయడమే. ఇదీ రాష్ట్రంలోని అక్రమ తవ్వకాల పరిస్థితి. ఈ నేపథ్యంలో వీటిపై ఇటీవల 'ఈనాడు' చేసిన క్షేత్రస్థాయి పరిశీలన కథనం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఏడేళ్ల బాలికపై మైనర్లు సామూహిక అత్యాచారం.. తీవ్రంగా హింసించి..
    Gang rape in odisha: ఏడేళ్ల బాలికపై ఆరుగురు మైనర్లు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని కేంద్రపడ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్పైస్​జెట్​కు షోకాజ్​ నోటీసులు! మరో విమానంలోనూ సాంకేతిక సమస్య
    స్పైస్​జెట్​ సంస్థకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది పౌరవిమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్‌(డీజీసీఏ). ఇటీవల తరచూ జరుగుతున్న సాంకేతిక లోపాలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. దీనిపై స్పందించిన కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా.. అన్నింటికన్నా ప్రయాణికుల భద్రతే తమకు ముఖ్యమైందని ట్వీట్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • జైలుపై తీవ్రవాదుల దాడి.. 600 మంది ఖైదీలు పరార్‌!
    Nigeria jailbreak: ఓ జైలుపై తీవ్రవాదులు దాడి చేశారు. ఈ క్రమంలో 600 మంది ఖైదీలు పరారయ్యారు. ఈ ఘటన నైజీరియాలో రాజధాని అబూజలో జరిగింది. విధుల్లో ఉన్న భద్రతా సిబ్బందిని హతమార్చిన దుండగులు.. పేలుడు పదార్థాలతో గోడలను కూల్చి లోనికి ప్రవేశించారని అధికారులు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విదేశీ విద్యపై డాలర్​ దెబ్బ.. భారీగా క్షీణించిన రూపాయి విలువ
    అమెరికా డాలర్​ విలువ పెరగడంతో విదేశీ చదువు భారంగా మారింది. ఫిబ్రవరి ఆఖరు వరకు ఒక డాలర్‌ విలువ రూ.75 కాగా, మార్చి నుంచి పెరగడం ప్రారంభమై.. బుధవారం రూ.78.94కు చేరింది. దీని వల్ల ఈ ఏడాది ఆగస్టు, డిసెంబరు నెలల్లో మన దేశం నుంచి అమెరికా విశ్వవిద్యాలయాల్లో చేరేందుకు సన్నద్ధమవుతున్నవారు 5 శాతానికిపైగా అదనపు ఖర్చు చేయాల్సి వస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రాజ్యసభకు విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజా, పి.టి.ఉష
    రాష్ట్రపతి కోటాలో రాజ్యసభకు నలుగురు ప్రముఖులను కేంద్రం నామినేట్​ చేసింది. దర్శకధీరుడు రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత వి.విజయేంద్రప్రసాద్‌, ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజ, పరుగుల రాణి పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డే ఆ జాబితాలో ఉన్నారు. ఆయ రంగాలో వీరు చేసిన విశేష కృషిని గుర్తిస్తూ.. కేంద్ర ప్రభుత్వం వి.విజయేంద్రప్రసాద్‌, ఇళయరాజ, పి.టి. ఉష, వీరేంద్ర హెగ్డేను పెద్దల సభకు ఎంపిక చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'రామారావు ఆన్ డ్యూటీ'లో వేణు.. పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​గా..
    రవితేజ నటించిన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటుడు వేణు లుక్​ పోస్టర్​ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ సినిమాలో అతను పవర్​ఫుల్​ పోలీస్​ ఆఫీసర్​ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.