ETV Bharat / city

ప్రధాన వార్తలు @9AM

.

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Feb 3, 2022, 9:01 AM IST

  • విజయవాడకు ఉద్యోగ సంఘాల నేతలు...అడ్డుకుంటున్న పోలీసులు

ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు అడుగు బయటకు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ గృహనిర్బంధాలు.. రైళ్లు, బస్సుల్లో వెళ్లేవారిని అడ్డుకునేందుకు అణువణువునా తనిఖీలు... జాతీయ, ఇతర ప్రధాన రహదారుల పొడవునా చెక్‌పోస్టులు... వాహనాల్లో ప్రయాణించేవారిపై ప్రశ్నలు... పాఠశాలల వద్ద పోలీసుల మోహరింపు... పీఆర్సీని వ్యతిరేకిస్తూ ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు గురువారం నిర్వహించ తలపెట్టిన చలో విజయవాడను అడ్డుకోడానికి ప్రభుత్వం ఇలా తీవ్రస్థాయి నిర్బంధాలు అమలుచేస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రైల్వే కేటాయింపుల్లోనూ మొండిచెయ్యే... అధికార పార్టీ ఎంపీల నుంచి ఒత్తిళ్లు లేకపోవడమే కారణం!

రైల్వే ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులోనూ ఆంధ్రప్రదేశ్‌కి కేంద్ర ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి, అధికార పార్టీ ఎంపీల నుంచి పెద్దగా ఒత్తిళ్లు లేకపోవడంతో తాజా బడ్జెట్‌లోనూ ఏపీకి కేంద్రం మొండిచెయ్యి చూపిందన్న విమర్శలున్నాయి. అమరావతి మీదుగా విజయవాడ-గుంటూరు రైలు మార్గానికి రూ.వెయ్యి మాత్రమే కేటాయించడం... ఏపీపై కేంద్రం వైఖరికి అద్దం పట్టింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చేప దాడిలో మత్స్యకారుడు మృతి.. ఏం జరిగిందంటే..

విశాఖ జిల్లా పరవాడ మండలం జాలారిపేట గ్రామానికి చెందిన నొల్లి జోగన్న.. కమ్ముకోనాం చేప దాడిలో మృతి చెందాడు. ఆరుగురు మత్స్యకారులతో కలిసి ముత్యాలమ్మపాలెం తీరం నుంచి ఆదివారం ఫైబర్ బోటుపై చేపలవేట వెళ్లారు. ఒడ్డు నుంచి సుమారు 90కిలోమీటర్లు దూరం వెళ్లాక సుమారు 300 గేలాలను వేసి వేట సాగించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • చివరకు పాఠశాల పిల్లలకు ఇచ్చే చిక్కీల్లోనూ వైకాపా నేతల అవినీతి: పట్టాభి

పాఠశాలల్లో పిల్లలకు ఇచ్చే చిక్కీల్లోనూ వైకాపా నేతలు అవినీతికి పాల్పడ్డారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాం ఆరోపించారు. దీనిపై ప్రశ్నిస్తే మంత్రి సురేశ్ ముఖం చాటేశారని.. ఆధారాలతో అవినీతి బయటపెట్టినా మంత్రి ఎందుకు స్వీకరించలేకపోతున్నారని పట్టాభి ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Punjab polls: 6న పంజాబ్​లో కాంగ్రెస్​ సీఎం అభ్యర్థి ప్రకటన!

పంజాబ్​ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిని ఈనెల 6న రాహుల్ గాంధీ ప్రకటిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రస్తుత సీఎం చరణ్​ జీత్ చన్నీ పేరు దాదాపుగా ఖరారైందని పేర్కొన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆప్‌ కొత్త పంథా- అభ్యర్థులతో అఫిడవిట్​పై సంతకాలు

గోవాలో నిజాయతీతో కూడిన పాలన అందించేందుకు.. పార్టీ ఫిరాయింపులకు చెక్​ పెట్టటమే లక్ష్యమంటూ.. సరికొత్త సంప్రదాయానికి తెర తీసింది ఆమ్ ఆద్మీ పార్టీ. ఈ మేరకు ​అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే 40 మంది అభ్యర్థులతో అఫిడవిట్‌పై సంతకాలు చేయించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ హైకోర్టులకు 19 మంది కొత్త న్యాయమూర్తులు!

దేశంలో పలు హైకోర్టులకు నూతన న్యాయమూర్తుల నియామకానికి 19 మంది పేర్లు కేంద్రానికి సిఫార్సు చేసింది సుప్రీంకోర్టు కొలీజియం. వీరిలో 12 మంది జడ్జీలను తెలంగాణ, ఆరుగురిని దిల్లీ హైకోర్టు న్యాయమూర్తులుగా, మరొకరిని పట్నా హైకోర్టు జడ్జిగా ప్రతిపాదించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'గల్వాన్'​ ఘర్షణలో చైనా సైనికుల మరణాలు 9 రెట్లు ఎక్కువ!

గల్వాన్​ లోయలో భారత్​తో జరిగిన ఘర్షణలో చైనా సైనికుల ప్రాణ నష్టం అధికారిక లెక్కల కంటే 9 రెట్లు ఎక్కువ ఉంటుందని ఆస్ట్రేలియా వార్తాపత్రిక తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అది సాధించాలనేదే నా లక్ష్యం: తెలుగు తేజం అర్జున్​

కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, పెంటేల హరికృష్ణ తర్వాత అంతర్జాతీయ చెస్‌లో ఆ స్థాయిలో సత్తా చాటుతున్నాడు తెలుగుతేజం అర్జున్‌ ఇరిగేశి. తాజాగా ప్రతిష్ఠాత్మక టాటా స్టీల్‌ చెస్‌ ఛాలెంజర్‌లో ట్రోఫీ దక్కించుకున్న 18 ఏళ్ల అర్జున్‌ .. ఈ టైటిల్‌ నెగ్గిన నాలుగో భారత ఆటగాడిగా ఘనత సాధించాడు. అంతేకాదు వచ్చే ఏడాది మాస్టర్స్‌ టోర్నీ బెర్తూ సొంతం చేసుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అల్లుఅర్జున్​-హరీశ్​ శంకర్ కాంబోలో మరో సినిమా?

హీరో అల్లుఅర్జున్​​-హరీశ్​​ శంకర్​ కాంబోలో మరో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. నేడు బన్నీతో కలిసి దిగిన ఓ ఫొటోను హరీశ్​ ట్వీట్​ చేశారు. ఇది చూసిన అభిమానులు వీరిద్దరి కాంబోలో మరో చిత్రం రానుందని ఆశిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.