ETV Bharat / city

TOP NEWS ప్రధాన వార్తలు @9AM

.

ప్రధాన వార్తలు @9AM
ప్రధాన వార్తలు @9AM
author img

By

Published : Jan 30, 2022, 9:01 AM IST

  • పదవీ విరమణ ప్రయోజనాలు దక్కక ఇక్కట్లు...రూ.800 కోట్ల వరకు పెండింగ్‌

పదవీ విరమణ ప్రయోజనాలు సమయానికి అందక రాష్ట్రంలో చాలామంది విశ్రాంత ఉద్యోగులు సతమతమవుతున్నారు. పీఎఫ్‌, ఇతర సొమ్ములు ఎన్నాళ్లయినా జమ కావడం లేదు. పదవీ విరమణ చేసినవారికి ప్రభుత్వం చెల్లించాల్సింది సుమారు రూ.800 కోట్లు ఉంటుందని అంచనా. ఇతర బకాయిలూ కలిపితే రూ.2,100 కోట్లు చెల్లించాలని ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సమ్మెదిశగా ఉద్యోగుల అడుగులు... ఎస్మా ప్రయోగించేందుకు ప్రభుత్వం సమాయత్తం

ఉద్యోగులు సమ్మెబాట పడితే...ఎస్మా ప్రయోగించే అంశంపై ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఆర్టీసీ, విద్యుత్ లాంటి కీలక శాఖలు కూడా ఉద్యమంలోకి వెళ్తామని ప్రకటించడంతో..ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. అత్యవసర విధులు నిర్వహించాల్సిన శాఖల ఉద్యోగులు సమ్మెకు వెళ్తే ఇబ్బందులు తలెత్తే అవకాశమున్నందున ఎస్మా ప్రయోగించే అంశంపై కసరత్తు జరుగుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే జారీ అయ్యే అవకాశాలున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • hc on girl treatment : ఆ బాలికకు ఉచిత వైద్యం అందించాలి

అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ బాలికకు ఉచితంగా చికిత్స అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. చికిత్స ఖర్చులను సమకూర్చేందుకు క్రౌడ్‌ ఫండింగ్‌ సహా అన్ని మార్గాలనూ అన్వేషించాలని ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొత్త జిల్లాల్లో మార్పులు చేయాలంటూ ఆందోళనలు.. ధర్నాలు... శిరోముండనాలు

కొత్త జిల్లాల ఏర్పాటుపై ఆందోళనలు మిన్నంటుతున్నాయి. జిల్లా కేంద్రాలు, రెవిన్యూ డివిజన్ల మార్పులతో పలు ప్రాంతాల్లో నిరసనలు కొనసాగాయి. ప్రకటించిన వాటితో కాకుండా తమ ప్రాంతాలతోనే ప్రత్యేక జిల్లాలను ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. ప్రభుత్వం తమ ఆకాంక్షలను నెరవేర్చకుంటే ఉద్యమిస్తామని..ఆయా సంఘాలు, ప్రజలు స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'నేరగాళ్లను పోటీ చేయనీయొద్దు'

ఎన్నికల్లో పోటీ చేయబోయే అభ్యర్థులు తీవ్రమైన నేరాభియోగాలు ఎదుర్కొంటుంటే.. వారిని అనర్హులుగా గుర్తించేలా ఉత్తర్వులు ఇవ్వాలని 2020లో ఓ పిల్​ దాఖలైంది. అయితే ఆ పిల్​పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు తాజాగా అంగీకారం తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కాంగ్రెస్‌లో వలస వేదన- ప్రియాంకా గాంధీకి కఠిన పరీక్ష

సంక్షోభంలో కాంగ్రెస్ పార్టీకి కష్టాలు మరింత జఠిలమవుతున్నాయి. భారీ సంఖ్యలో నేతలు పార్టీని వీడుతున్నారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ.. వలసలు పార్టీకి తలనొప్పిగా మారాయి. ఆ రాష్ట్రానికి ఎన్నికల ఇంఛార్జిగా ఉన్న ప్రియాంకా గాంధీకి ఇదే కఠిన పరీక్ష అని విశ్లేషకులు చెబుతున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కశ్మీర్​లో ఎన్​కౌంటర్- ఐదుగురు పాక్ ముష్కరులు హతం

జమ్ము కశ్మీర్​లో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్​కౌంటర్​ జరిగింది. ఈ ఘటనల్లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. మృతుల్లో జైషే మహమ్మద్(జేఈఎం) కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రష్యాలో జనాభా సంక్షోభం.. దారుణంగా దెబ్బతీసిన కరోనా

రష్యాలో కొవిడ్‌ విజృంభణ, ఇతరత్రా కారణాలతో.. గతేడాది దేశ జనాభా భారీగా పడిపోయింది. ఏకంగా పది లక్షలకంటే ఎక్కువమంది తగ్గిపోయినట్లు ప్రభుత్వ గణాంకాల సంస్థ 'రోస్‌స్టాట్' తాజాగా వెల్లడించింది. సోవియట్ యూనియన్ పతనం తర్వాత మొట్టమొదటిసారిగా ఈ స్థాయిలో క్షీణత నమోదు కావడం గమనార్హం. కొవిడ్‌ బారినపడే 6.60 లక్షల మంది మరణించినట్లు రోస్‌స్టాట్ తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Tata Steel Chess Challengers: తెలుగు తేజం అర్జున్ అదరహో

టాటా స్టీల్​ చెస్​ ఛాలెంజర్స్​ విభాగంలో తెలుగు అబ్బాయి అర్జున్​ ఇరిగైసిని టైటిల్​ వరించింది. దీంతో వచ్చే ఏడాది మాస్టర్స్‌ టోర్నీకి అతడు అర్హత పొందాడు. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-100లోకి దూసుకెళ్లాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వరుణ్ తేజ్ 'గని' సన్నద్ధం.. జాలీరెడ్డి 'బడవ రాస్కెల్'

సినీ అప్డేట్స్ వచ్చేశాయి. వరుణ్​తేజ్ 'గని', 'పుష్ప'లో జాలీరెడ్డి నటించిన కన్నడ చిత్రం తెలుగు వెర్షన్​ రిలీజ్​కు సంబంధించిన సంగతులు ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.