- MURDER: ముద్దాడపేటలో దారుణం... ఇద్దరిని చంపి వ్యక్తి ఆత్మహత్య
శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ముద్దాడపేటలో దారుణం జరిగింది. భార్యతో పాటు సోదరిని ఓ వ్యక్తి హత్య చేశాడు. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- FIRE ACCIDENT: బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం...13 మందికి గాయాలు
విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్లో అర్ధరాత్రి అగ్నిప్రమాదం జరిగింది. బెర్రీ అనే పరిశ్రమలో గ్యాస్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 13 మంది కార్మికులకు గాయాలయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Strike: మేము సైతం సమ్మెకు.. సై అన్న ఆర్టీసీ, వైద్య, ఆరోగ్య శాఖల ఉద్యోగులు
పీఆర్సీకీ సంబంధించి రాష్ట్రంలో ఆందోళనలు ఉద్ధృతం అవుతున్నాయి. అన్ని ఉద్యోగ సంఘాలు సమ్మెకు సై అంటున్నాయి. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా రిలే దీక్షలు కొనసాగుతుండగా.. ఫిబ్రవరి 3న నిర్వహించే ‘చలో విజయవాడ’ను విజయవంతం చేసేందుకు సాధన సమితి సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ప్రివిలేజ్ కమిటీకి రఘురామ అనర్హత పిటిషన్
వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున వారిపై అనర్హత వేటు వేయాలంటూ ఆ పార్టీల నేతలు దాఖలు చేసిన పిటిషన్లను లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా ప్రివిలేజ్ కమిటీకి పంపారు. వైకాపా లోక్‌సభ విప్ మార్గాని భరత్ ఇచ్చిన పిటిషన్‌పై విచారణ జరిపి, ప్రాథమిక నివేదిక సమర్పించాలని ప్రివిలేజ్ కమిటీని స్పీకర్ కోరినట్లు లోక్‌సభ సచివాలయం శుక్రవారం విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బహిష్కార ఉత్తర్వు అసాధారణ చర్య'
వ్యక్తిని బహిష్కరించడం అంటే నిర్ణీత కాలం వరకు అతనిని తన సొంత ఇంటిలో కూడా నివసించేందుకు తిరస్కరించడమేనని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. అతనికి జీవనోపాధి కూడా లభించకుండా చేయడమేనని పేర్కొంది. ఇటువంటి ఉత్తర్వు జారీ అసాధారణమైన చర్య అని స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'ఎద్దుల బండి లైబ్రరీ'లో పిల్లల ఇంటికే పుస్తకాలు!
కరోనా కారణంగా పాఠశాలలు మూతపడి చదువుకు దూరమైన విద్యార్థుల కోసం వినూత్న ఆలోచన చేశారు మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ ఉపాధ్యాయురాలు. ఆన్లైన్ తరగతులకు హాజరయ్యేందుకు ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కోసం.. ఎద్దుల బండి లైబ్రరీ శ్రీకారం చుట్టారు. ఇంటింటికీ వెళ్లి పుస్తకాలు పంపిణీ చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'త్వరలో భారత్-చైనా 15వ విడత చర్చలు- ఆ తీర్మానానికి అంగీకారం'
భారత్-చైనా సరిహద్దుల్లో వివాద పరిష్కారానికి పరస్పర ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని త్వరగా రూపొందించడానికి.. సన్నిహిత సంబంధాలు కొనసాగించడానికి అంగీకరించినట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ తెలిపారు. వీలైనంత త్వరలో 15వ విడత సైనిక చర్చలకు ఇరు దేశాలు అంగీరించినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్‌కు ఎస్-400 సరఫరాపై అమెరికా ఆగ్రహం
భారత్‌కు ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థలను విక్రయించిన రష్యాపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ ప్రాంతాన్ని అస్థిర పరిచేందుకు రష్యా ప్రయత్నిస్తోందని విమర్శించింది. ఈ విషయంపై భారత్‌తో చర్చలు కొనసాగిస్తున్నామని తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఆసియాకప్ హాకీ.. భారత అమ్మాయిలకు కాంస్యం
ఆసియాకప్ మహిళల హాకీ టోర్నీ ఫైనల్లో భారత జట్టు ఓడిపోయింది. ఫలితంగా కాంస్యంతో సరిపెట్టుకుంది. టైటిల్‌ను జపాన్ సొంతం చేసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నాది 'ఐరన్ లెగ్' అని అన్నారు: హీరోయిన్ కీర్తి సురేశ్
కెరీర్ ప్రారంభంలో తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని హీరోయిన్ కీర్తిసురేశ్ చెప్పింది. ఒకటి, రెండు సినిమాలు మొదలై, ఆగిపోయేసరికి తనది ఐరన్ లెగ్ అని అన్నట్లు తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి