- కొడాలి నాని, డీజీపీపై తీవ్ర వ్యాఖ్యలు.. బుద్దా వెంకన్న అరెస్ట్.. అర్ధరాత్రి విడుదల
తెదేపా నేత బుద్దా వెంకన్నను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం మీడియా సమావేశంలో మంత్రి కొడాలి నాని, డీజీపీ గౌతమ్ సవాంగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన చేసిన నేపథ్యంలో ఆయన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన బుద్దా వెంకన్న... తాను మాట్లాడిన మాటలు వాస్తవమే అన్నారు. డీజీపీ సవాంగ్.. సీఎం జగన్‌కు తొత్తుగా పని చేస్తున్నారని పునరుద్ఘాటించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- నేడు 'వైఎస్సార్ ఈబీసీ నేస్తం' నిధులు జమ
వైఎస్సార్ ఈబీసీ నేస్తం పథకాన్ని.. సీఎం జగన్ మంగళవారం ప్రారంభించనున్నారు. రాష్ట్రంలోని 3.92 లక్షల మందికి లబ్ధిదారులకు.. రూ.589 కోట్లు విడుదల చేయనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- పోలవరం ప్రాజెక్టు అంచనాలపై అవగాహనకు వచ్చాం -విజయసాయి రెడ్డి
పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనాలను ఆమోదించేందుకు కేంద్ర ప్రభుత్వ అధికారుల బృందంతో సమావేశమైంది. ఈ భేటీలో ప్రాజెక్టు అంచనాలపై ఒక అవగాహనకు వచ్చామని వైకాపా పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- RTPP: సీమ వెలుగులపై చిన్న చూపు
రాయలసీమలో ఉపాధి, లోవోల్టోజి సమస్య పరిష్కారమే ధ్యేయంగా తాప విద్యుదుత్పత్తి కేంద్రాన్ని 1988 మార్చి 18న అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టీ రామారావు శంకుస్థాపన చేశారు. క్రమేణా అభివృద్ధి చెందుతూ మొత్తం 4దశల్లో ఏర్పాటుచేసిన ఆరు యూనిట్లలో 1,650 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యానికి చేరింది. ప్రస్తుతం ఉత్పత్తి వ్యయం ఎక్కువగా ఉందన్న నెపంతో వేల కోట్లు వెచ్చించిన ప్రాజెక్టును నామమాత్రంగా వినియోగిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఉదయం రాజ్యసభ.. సాయంత్రం లోక్‌సభ
కరోనా వ్యాప్తి నేపథ్యంలో.. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయ సభలు వేర్వేరు సమయాల్లో సమావేశం కానున్నాయి. ఉదయం రాజ్యసభ, సాయంత్రం లోక్‌సభ సమావేశాలు జరగనున్నట్లు కేంద్రం వెల్లడించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరణ.. ఆప్ నేత ఆత్మహత్యాయత్నం
ఉత్తర్‌ప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతోంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే నామినేషన్ తిరస్కరించారని ఆమ్ ఆద్మీ పార్టీ నేత ఒకరు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటన ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 20 మంది భారత జాలర్లను అప్పగించిన పాక్
తమ భూభాగంలోకి ప్రవేశించారంటూ గతంలో అరెస్టు చేసిన 20 మంది జాలర్లను తిరిగి భారత్‌కు అప్పగించింది పాకిస్థాన్. సోమవారం వాఘా సరిహద్దు నుంచి మత్య్సకారులు ఇండియా చేరుకున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- చివరి గమ్యస్థానానికి చేరిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్
ఖగోళ రహస్యాలను ఛేదించే దర్శిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ చివరి గమ్యస్థానానికి చేరుకుంది. ఈ విషయాన్ని అమెరికా అంతరిక్ష సంస్థ నాసా స్పష్టం చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సమస్యల సుడిగుండంలో టీమ్‌ఇండియా.. బయటపడే దారేది?
ఎన్నో ఆశలతో దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లింది టీమ్‌ఇండియా. కానీ చివరికి ఇటు టెస్టుల్లో, అటు వన్డేల్లో సిరీస్‌లు కోల్పోయి ఉత్త చేతులతో ఇంటిముఖం పట్టింది. విజయాలు దక్కకపోగా.. బోలెడన్ని సమస్యలను మూటగట్టుకుంది భారత్. ఆ సమస్యల్ని సత్వరం పరిష్కరించుకోకుంటే.. మున్ముందు చిన్నపాటి సంక్షోభాన్ని ఎదుర్కోక తప్పేలా లేదు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'సల్మాన్.. మిమ్మల్ని టచ్ చేయొచ్చా..?'
కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌తో తన అనుభవాల్ని పంచుకుంది 'అఖండ' బ్యూటీ ప్రగ్యా జైశ్వాల్. ఓ పాట షూటింగ్లో భాగంగా.. సల్మాన్.. మిమ్మల్ని తాకొచ్చా? అని అడిగానని చెప్పింది. మరి దానికి సల్మాన్ సమాధానం ఏంటి? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి