- NARA LOKESH: 'ఫ్యాన్ గుర్తుకు ఓటేసి.. అదే ఫ్యాన్‌కు ఉరివేసుకుంటున్నారు..!'
ఫ్యాన్ గుర్తుకి ఓటేస్తే ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయనుకున్న యువత.. ఉద్యోగం రాక అదే ఫ్యాన్‌కు ఉరివేసుకొని చనిపోతున్నారని నారా లోకేశ్ మండిపడ్డారు. సీఎం జగన్ పాలనలో లోపాల కారణంగానే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ACHENNAIDU: 'తప్పుడు కేసులతో ఎఫ్ఐఆర్ పుస్తకాలన్నీ నిండిపోయాయి..!'
తెదేపా శ్రేణులపై అక్రమ కేసులు పెట్టేందుకే పోలీసులు జీతాలు తీసుకుంటున్నారా అని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. అలాగే తప్పుడు కేసులు పెట్టిన పోలీసుల పేర్లను గుర్తుంచుకుంటామని.. భవిష్యత్తులో వారు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- SUICIDE: ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక...ఏం చేయాలో దిక్కుతోచక..
ఉద్యోగాల నోటిఫికేషన్ వెలువడక.. మనస్తాపానికి గురైన ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన.. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని ఎర్రకోటలో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- BOARDS MEETING: ఇవాళ కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల భేటీ
నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించిన కేంద్రం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్‌పై ఈరోజు దిల్లీలో కీలక సమావేశం జరగనుంది. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి నేతృత్వంలో కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఛైర్మన్లతో సమీక్ష నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పెగసస్‌పై మరో అఫిడవిట్ సమర్పించలేం'
పెగసస్‌పై తాము ఇప్పటికే సమర్పించిన అఫిడవిట్ సరిపోతుందని, సవివరంగా మరో అఫిడవిట్‌ను సమర్పించలేమని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నదే తమ అభిప్రాయమని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఉగ్రవాదానికి చెక్ పెట్టేలా 'నాట్‌గ్రిడ్' వ్యవస్థ.. త్వరలోనే...
ఉగ్రవాదానికి చెక్‌పెట్టే నాట్‌గ్రిడ్ వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోదీ త్వరలో ప్రారంభిస్తారని అధికారిక వర్గాలు తెలిపాయి. కరోనా లేకపోయి ఉంటే ఇప్పటికే ఇది ప్రారంభమై ఉండేదని ఇటీవల హోంమంత్రి అమిత్‌షా ఓ కార్యక్రమంలో చెప్పారు. నాట్‌గ్రిడ్‌తో ఉగ్రవాదుల సమాచారంతో పాటు ఆర్థిక నేరాలు, ఇతర కీలక విషయాలు తెలుస్తాయని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నిమజ్జనం చూస్తున్న వారిపైకి దూసుకెళ్లిన స్కార్పియో
వినాయక నిమజ్జనాన్ని వీక్షిస్తున్న వారిపైకి స్కార్పియో దూసుకెళ్లింది. వాహన డ్రైవర్ స్కార్పియోను.. (Scorpio) ఆపకుండా 50 మీటర్లు తీసుకెళ్లాడు. ఈ ఘటనలో 12 మందికి గాయాలయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్షిపణులతో మళ్లీ సవాళ్లు విసురుతున్న కిమ్!
అణుకార్యకలాపాల విషయంలో ఉత్తర కొరియా(North Korea Nuclear Weapons) మళ్లీ దూకుడు వైఖరిని ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా.. సుదూర లక్ష్యాలను ఛేదించే ఓ క్రూయిజ్ క్షిపణిని(Long Range Cruise Missile) ఆ దేశం విజయవంతంగా ప్రయోగించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్
జింబాబ్వే మాజీ సారథి బ్రెండన్ టేలర్(brendan taylor retirement) అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఈ విషయాన్ని తెలుపుతూ భావోద్వేగ ట్వీట్ చేశాడు. తన సుదీర్ఘ ప్రయాణంలో తోడుగా ఉన్న ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tollywood Drugs Case: ఈడీ విచారణకు హాజరైన నటుడు నవదీప్
టాలీవుడ్ మాదకద్రవ్యాల కేసులో ఈడీ విచారణకు సోమవారం ఉదయం నటుడు నవదీప్ హాజరయ్యారు. మనీ లాండరింగ్ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. అనుమానాస్పద లావాదేవీలు, డ్రగ్స్ విక్రేత కెల్విన్‌తో ఉన్న సంబంధాల గురించి ఈడీ అధికారులు ఆరా తీసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.