ETV Bharat / city

TOP NEWS : ప్రధానవార్తలు @ 9AM - ap top ten news

...

TOP NEWS
ప్రధానవార్తలు
author img

By

Published : Jul 30, 2021, 9:00 AM IST

  • current shock: గుంటూరు జిల్లాలో ఆరుగురు అనుమానాస్పద మృతి
    గుంటూరు జిల్లాలో అనుమానాస్పదస్థితిలో ఆరుగురు మృతి చెందారు. రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. షెడ్డుపై కరెంటు తీగలు పడటం వల్ల విద్యుదాఘాతంతో వీరు మరణించి ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పీపీ-1 నుంచి డిగ్రీ వరకు అంతా ఆంగ్ల మాధ్యమమే
    రాష్ట్రంలో పూర్వ ప్రాథమిక విద్య(పీపీ-1) నుంచి డిగ్రీ వరకు విద్యార్థులు ఆంగ్ల మాధ్యమంలోనే అభ్యసించేలా గొప్ప ప్రయత్నాన్ని మొదలు పెట్టామని సీఎం జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది రెండో విడత విద్యా దీవెనలో భాగంగా 10.97 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాల్లో రూ.693.81 కోట్లను తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్‌ గురువారం బటన్‌ నొక్కి జమ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రాష్ట్రంలో రెండేళ్లుగా రాయితీ రుణాలకు మంగళం
    పేదరికాన్ని జయించి.. సొంత కాళ్లపై నిలబడాలన్న ఆకాంక్షతో లక్షల మంది ఎస్సీ, ఎస్టీలు ఆర్థిక చేయూత కోసం ఎదురుచూస్తుంటారు. ఇలాంటి వారికి కార్పొరేషన్లు ఇచ్చే రాయితీ రుణాలు సువర్ణావకాశం. ఈ రుణాలను సద్వినియోగం చేసుకుని రాష్ట్రంలో వేల కుటుంబాలు తలెత్తుకుని జీవిస్తున్నాయి. ఇలాంటి రాయితీ రుణ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా నిలిపేసింది. ఇలాంటి పథకాలను ప్రభుత్వం నిలిపేయడం వేలాది నిరుపేదలకు అశనిపాతంగా మారుతోంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • జమ్ముకశ్మీర్​లో మరోసారి డ్రోన్ల కలకలం
    జమ్ముకశ్మీర్​లోని మూడు ప్రాంతాల్లో డ్రోన్లు కలకలం సృష్టించాయి. గురువారం రాత్రి 8:30 గంటల సమయంలో డ్రోన్లు సంచరించినట్లు అధికారులు తెలిపారు. ఈ డ్రోన్లు పాకిస్థాన్​కు చెందినవిగా అనుమానిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కాంగ్రెస్‌లో చేరనున్న ప్రశాంత్‌ కిశోర్‌?
    ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే)కు కాంగ్రెస్‌ పార్టీలో ఎలాంటి స్థానం కల్పించాలనే విషయమై అంతర్గతంగా చర్చలు కొనసాగుతున్నాయి. భాజపాను ఓడించే లక్ష్యంతో.. పీకేకు పార్టీలో కీలక పదవిని అప్పగించాలని కాంగ్రెస్​ అధిష్ఠానం భావిస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆ రాష్ట్రానికి వెళ్లొద్దని ప్రభుత్వం ఆదేశాలు
    మిజోరంతో సరిహద్దు ఘర్షణకు సంబంధించిన వ్యవహారంపై అసోం ప్రభుత్వం.. తమ రాష్ట్ర ప్రజలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ రాష్ట్రంలో పర్యటించవద్దని సూచించింది. ఈ మేరకు అసోం హోంశాఖ ప్రకటన విడుదల చేసింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • '10 విద్యార్థులకు మూల్యాంకనంలో న్యాయం'
    అంతర్గత మార్కుల్ని ప్రామాణికంగా తీసుకోవడంలో అన్యాయం ఏమీ లేదని సీబీఎస్‌ఈ గురువారం దిల్లీ హైకోర్టుకు తెలిపింది. ఈ విధానంలో ఏ పాఠశాల కూడా ఏ విద్యార్థిపైనా పక్షపాతం చూపలేదని చెప్పింది. వార్షిక పరీక్షల మార్కులు నిర్ణయించేందుకు పాఠశాలల వారీగా ఫలితాల కమిటీ ఏర్పాటవుతుందని, ఇందులో సదరు పాఠశాల ఉపాధ్యాయులతో పాటు పొరుగు పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఉంటారని పేర్కొంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రమాదకర వేరియంట్లూ తల వంచాల్సిందే!
    మహమ్మారిని దీటుగా ఎదుర్కొనేందుకు శక్తిమంతమైన యాంటీబాడీలను రూపొందించారు జర్మనీ శాస్త్రవేత్తలు. అల్పకా జంతువుల రక్తం ద్వారా వీటిని అభివృద్ధిపరిచారు. అత్యంత ప్రమాదకర కరోనా వేరియంట్లను కూడా ఇవి సమర్థంగా అడ్డుకోగలవు అంటున్నారు పరిశోధకులు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Olympics Live: క్వార్టర్స్​లో దీపికా కుమారి- మను బాకర్​ విఫలం
    మహిళల 60 కేజీల లైట్​ వెయిట్​ విభాగంలో.. భారత బాక్సర్​ సిమ్రన్​జీత్​ కౌర్​ ఓటమిపాలైంది. థాయ్​లాండ్​ బాక్సర్​ సీసోండీ చేతిలో 5-0 తేడాతో ఓడి.. ఒలింపిక్స్​ నుంచి నిష్క్రమించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Sonu Sood: తెరపై ప్రతినాయకుడు.. వలస కూలీల ఆపద్బాంధవుడు!
    లాక్​డౌన్​లో ఎంతోమందికి సాయం చేస్తూ, వారి మనసుల్లో చోటు సంపాదించుకున్నాడు ప్రముఖ నటుడు సోనూసూద్(sonusood). వలస కూలీలతో పాటు దేశంలోని ఎంతోమందికి వివిధ రకాలుగా తన వంతు సహకారాన్ని అందించి.. రియల్​లైఫ్​ హీరోగా పేరొందాడు. శుక్రవారం(జులై 30) సోనూసూద్​ పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.