- BJP PROTEST: ప్రొద్దుటూరులో భాజపా ధర్నా.. పోలీసులు - నేతల మధ్య ఘర్షణ!
కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలో భారీగా పోలీసుల మోహరించారు. టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు నిరసనగా భాజపా ఆందోళనకు పిలుపునిచ్చిన క్రమంలో ప్రొద్దుటూరులో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ కార్యాలయం నుంచి టిప్పుసుల్తాన్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన ప్రాంతానికి వెళ్లేందుకు భాజపా నేతలు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకున్నారు. పోలీసులకు, భాజపా నేతలకు మధ్య తోపులాట జరిగింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- viveka murder case: 51వ రోజు సీబీఐ విచారణ... మృతదేహాన్ని శుభ్రం చేసి కట్లు కట్టిన వైద్యులకు ప్రశ్నలు
వైఎస్ వివేకా హత్యకేసులో 51వ రోజు సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో ఏడుగురు అనుమానితులను అధికారులు ప్రశ్నిస్తున్నారు. వివేకా మృతదేహం శుభ్రం చేసి కట్లు కట్టిన వైద్యులుగా అనుమానించి ....వీరిని విచారిస్తున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- crops damage: పోటెత్తిన గోదావరి.. ముంపు ప్రాంతాల పంటలు జలమయం
ఎగువన కురుస్తున్న వర్షాలకు.. గోదావరి పరివాహక ప్రాంతాలన్నీ ముంపు బారిన పడ్డాయి. కొన్ని మండలాల్లో ఇళ్లన్నీ జలదిగ్భంధం అయ్యాయి. నీట మునిగిన పంటల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. వరదల కారణంగా.. పంటలన్నీ నీటమునిగిపోగా.. అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Tenders to roads repairs: వర్షాలు తగ్గాక రహదారుల పనులు చేస్తాం.. బిల్లులు చెల్లిస్తాం!|
రహదారుల మరమ్మతులకు.. రవాణా, ఆర్‌అండ్‌బీ చర్యలు తీసుకుంటోంది. వర్షాలు తగ్గాక పునరుద్ధరణ పనులు చేసేందుకు.. టెండర్లను ఆహ్వానిస్తోంది. మొత్తం 1,140 పనులుండగా.. ఇప్పటికే 403 పనులను గుత్తేదారులకు అప్పగించారు. బిల్లుల చెల్లింపులో జాప్యం అవుతుందనే భావనలో గుత్తేదారులు ఉన్నారని.. వాటిని దూరం చేస్తామని ఆర్‌అండ్‌బీ ముఖ్య కార్యదర్శి అన్నారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అసోం-మిజోరం హింసపై కాంగ్రెస్ ఫైర్
అసోం-మిజోరం సరిహద్దు హింసపై కాంగ్రెస్ మండిపడింది. ప్రజల్లో అపనమ్మకం, విద్వేషాలను నింపుతున్నారని ధ్వజమెత్తింది. లోక్‌సభలో దీనిపై చర్చించాలని డిమాండ్ చేసింది. మరోవైపు, టీఎంసీ సైతం ఈ ఘటనపై విమర్శలు గుప్పించింది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విపక్ష సభ్యుల తీరుపై వెంకయ్య అసహనం
రాజ్యసభలో విపక్ష సభ్యుల తీరుపై ఛైర్మన్ వెంకయ్యనాయుడు అసహనం వ్యక్తం చేశారు. వర్షకాల సమావేశాల్లో సభ సజావుగా సాగకుండా చూసేందుకు కొందరు సభ్యులు నిర్ణయం తీసుకున్నారంటూ మీడియాలో వచ్చిన కథనాలపై ఆందోళన వ్యక్తం చేశారు. సభ్యులు తమ ఆలోచనా దృక్ఫతాన్ని మార్చుకోవాలని హితవు పలికారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మరో 6 కంపెనీల ఐపీఓలకు సెబీ గ్రీన్ సిగ్నల్
దేశంలో ఐపీఓకి వస్తున్న కంపెనీలు పెరుగుతున్నాయి. తాజాగా మరో 6 కంపెనీల ఐపీఓ దరఖాస్తుకు సెబీ ఆమోద ముద్ర వేసింది. ఆ కంపెనీలు ఏవి? అవి సమీకరించనున్న నిధుల మొత్తం ఎంత? అనే వివరాలు ఇలా ఉన్నాయి.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నాసాకు రూ.15 వేల కోట్ల డిస్కౌంట్ ఇస్తానంటున్న బెజోస్!
అమెరికా అంతరిక్ష సంస్థ(నాసా) చంద్రునిపైకి చేపట్టబోయే మానవసహిత యాత్రకు అవసరమైన సాంకేతికతను అందించేందుకు అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ ముందుకొచ్చారు. దీనికోసం రూ.15వేల కోట్ల రాయితీని ప్రకటించారు. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్‌ను ఎలాన్ మస్క్‌కు చెందిన 'స్పేస్ ఎక్స్'కి కేటాయించగా.. ఎలాగైనా దక్కించుకోవాలన్న పట్టుదలతో ఉన్న బెజోస్ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- షూటింగ్లో నిరాశ.. బాక్సింగ్, హాకీలో విజయాలు
టోక్యో ఒలింపిక్స్‌లో పతకం ఖాయమనుకున్న షూటింగ్లో భారత అథ్లెట్లు ఘోరంగా విఫలమయ్యారు. 10మీ. ఎయిర్ పిస్టల్, ఎయిర్ రైఫిల్స్ విభాగాల్లో భారత్ కథ ముగిసింది. టీటీలోనూ ఆచంట కమల్ చేతులెత్తేశాడు. హాకీలో మన్‌ప్రీత్ సేన విజయం సాధించగా.. బాక్సింగ్‌లో లవ్లీనా పతకాశలు రేపుతోంది. ఇక బ్యాడ్మింటన్‌లో డబుల్స్ జోడీ గెలిచిప్పటికీ క్వార్టర్స్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Amitabh Bachchan : రామోజీ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటిన అమితాబ్ బచ్చన్
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో మైలురాయిని చేరుకుంది. స్వయంగా బాలీవుడ్ సూపర్ స్టార్.. అమితాబ్ బచ్చన్(Amitabh Bachchan) ఈ సవాల్‌ను స్వీకరించారు. తెలంగాణ ఎంపీ సంతోశ్ కుమార్ ఛాలెంజ్‌ను స్వీకరించిన బిగ్ బీ.. హైదరాబాద్ ఫిల్మ్ సిటీలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీ సంతోశ్‌ను ప్రశంసించారు.పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.