ETV Bharat / city

ప్రధాన వార్తలు @9 PM

.

author img

By

Published : Jul 16, 2020, 9:00 PM IST

TOP NEWS @9PM
ప్రధాన వార్తలు @9 PM
  • వైద్యం బాగుంది.. కానీ..!

ఏపీ ఉపముఖ్యమంత్రికి, ఆయన భార్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ కారణంతో మొదట తిరుపతి ఆస్పత్రిలో చికిత్స పొంది...ఇప్పుడు హైదరాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే.. ఏపీ ఆస్పత్రుల్లో వైద్యం సరిగా అందడం లేదా... అంటూ విపక్షాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఉపముఖ్యమంత్రి స్పందించి ప్రకటన విడుదల చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • యోధుల మరణంపై ఆవేదన

పోలీసులు, వైద్యులు కరోనా విధుల్లో ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆవేదన చెందారు. విధి నిర్వహణలో అశువులు బాసిన పోలీస్ అధికారులకు, వైద్యులకు జనసేన తరపున శ్రద్ధాంజలి ఘటిస్తున్నట్లు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • త్వరలోనే విద్యా సంవత్సర క్యాలెండర్​

రాష్ట్రంలో కొవిడ్​ కారణంగా విద్యార్థులకు సమయం వృథా కాకుండా ఆన్​లైన్​ తరగతులు నిర్వహించేందుకు విధి విధానాలు రూపొందిస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్​ వెల్లడించారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేలోపు నాడు - నేడు కార్యక్రమం కింద పాఠశాలలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని చెప్పారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • బెయిల్ పిటిషన్ వాయిదా

మాజీ మంత్రి అచ్చెన్నాయుడు వేసిన బెయిల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి విచారణను సోమవారానికి వాయిదా వేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'మహా' ఉద్ధృతి

మహారాష్ట్రలో కొత్తగా 8 వేల 641 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల 84 వేలు దాటింది. మరో 266 మంది ప్రాణాలు కోల్పోయారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి.

  • బాధితులున్న చోటికే..!

కరోనా రోగులకు ఎక్కడైనా వైద్య సేవలు అందించే సరికొత్త ఆసుపత్రిని మద్రాస్‌-ఐఐటీ అభివృద్ధి చేసింది. వైరస్‌ సోకిన వ్యక్తులున్న ప్రదేశంలోనే చికిత్స చేసేందుకు మెడిక్యాబ్‌ అనే పోర్టబుల్‌ ఆసుపత్రి యూనిట్‌ను రూపొందించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • స్వల్ప తగ్గుదల

బంగారం, వెండి ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడిపై రూ.32, కిలో వెండి మీద రూ.124 క్షీణించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆరోపణల వెల్లువ

రష్యా తమ వ్యాక్సిన్​ పరిశోధనలను దొంగలించడానికి యత్నిస్తోందని బ్రిటన్​, అమెరికా, కెనడా దేశాలు ఆరోపించాయి. రష్యా నిఘా వ్యవస్థకు చెందిన కోజీ బేర్​.. దాడులకు పాల్పడుతోందని పేర్కొన్నాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • దురదృష్ట క్రికెటర్లు

క్రికెట్​లో టాలెంట్​ ఒక్కటే ఉంటే సరిపోదు. దానికి తోడు కాసింత అదృష్టమూ తోడవ్వాలి. లేదంటే నైపుణ్యం ఉన్నా కనుమరుగైపోక తప్పదు. ఎప్పుడో క్రికెట్​లోకి వచ్చి, దేశవాళీల్లో రాణించినా జాతీయ జట్టులో చోటు సుస్థిరం చేసుకోలేకపోయిన ఐదుగురు అన్​లక్కీ క్రికెటర్ల గురించి తెలుసుకుందాం.

  • కట్టప్ప పాత్రలో ఆ హీరో..!

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'బాహుబలి' ఎంతటి ఘనవిజయం సాధించిందో తెలిసిందే. ఇందులో బాహుబలితో పాటు కట్టప్ప పాత్రకు మంచి పేరొచ్చింది. అయితే ఈ పాత్ర కోసం మొదట చిత్రబృందం సంజయ్​దత్​ను అనుకుందట. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.