- వైద్య వాహన సేవలు
జూలై 1న రాష్ట్రవ్యాప్తంగా నూతన 104, 108 వాహనాల సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ విజయవాడ బెంజి సర్కిల్లో ప్రారంభించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సమీక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రాణాలతో చెలగాటం: తెదేపా
అచ్చెన్నాయుడు ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని తెదేపా నేతలు మండిపడ్డారు. కక్ష సాధించుకునేందుకే అర్ధరాత్రి డిశ్చార్జ్ పేరిట హైడ్రామా నడిపారని ధ్వజమెత్తారు. మానవతా విలువలు మరిచి పోలీసులు అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'వేదిక'పై సవాల్
అమరావతి కరకట్ట వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వైకాపా సర్కార్ ప్రజావేదికను కూల్చివేయించి ఏడాది పూర్తయిన సందర్భంగా..... ప్రాంగణాన్ని పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశం నేతలను పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని... ప్రభుత్వం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని తెదేపా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- భార్యాభర్తలపై నేతల దాడి
కడప జిల్లా చింత కొమ్మదిన్న మండలానికి చెందిన భార్య భర్తలపై వైకాపా నాయకులు దాడికి పాల్పడ్డారు. ఘటనలో ఇద్దరికి గాయాలవగా బాధితులను రిమ్స్‌కు తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రాణాలపై 'పిడుగు'
బిహార్‌లో ఒక్కరోజులో పిడుగుపాటుకు గురై 83 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు రాష్ట్ర విపత్తు నిర్వహణ విభాగం ప్రకటన విడుదల చేసింది. వేర్వేరు ప్రాంతాల్లో పిడుగులు పడిన ఘటనల్లో వీరు మృతి చెందినట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- 'నల్ల' నిల్వలు తగ్గాయ్
స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ సంస్థల నగదు నిల్వలు గణనీయంగా తగ్గాయి. 2019లో డిపాజిట్లు 6 శాతం తగ్గి రూ.6,625 కోట్లకు పరిమితమయ్యాయి. స్విట్జర్లాండ్ కేంద్ర బ్యాంకు ఈమేరకు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- లాడెన్.. అమరవీరా..!
అంతర్జాతీయ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను పాకిస్థాన్ ప్రధాని 'అమరవీరుడు' అనడం తీవ్ర విమర్శలకు తావిచ్చింది. పార్లమెంటులో ఓ అంశంపై చర్చ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు ఇమ్రాన్ ఖాన్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- నేపాల్ 'వాచ్'టవర్
భారత్ సరిహద్దు వద్ద నేపాల్ వాచ్ టవర్ నిర్మాణం చేయడం వల్ల సరికొత్త వివాదం తెరపైకి వచ్చింది. సరిహద్దులోని భారత కార్యకలాపాలపై నిఘా ఉంచాలని నేపాల్‌పై చైనా ఒత్తిడి పెంచినట్టు.. అందుకే వాచ్ టవర్‌ను నిర్మించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
కరోనా లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ఆటగాళ్లు ఒక్కొక్కరు ఔట్ డోర్ శిక్షణను ప్రారంభిస్తున్నారు. తాజాగా టీమ్ఇండియా ఓపెనర్ రోహిత్ శర్మ ప్రాక్టీస్‌ను మొదలుపెట్టాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
- ప్రియా వారియర్.. ఓదార్పు
ఒకే ఒక కన్నుగీటుతో కుర్రకారును తనవైపుకు తిప్పుకుంది యువ కథానాయిక ప్రియా ప్రకాష్ వారియర్. అప్పటి నుంచి ఆమెకు విశేష ప్రేక్షకాదరణ దక్కుతోంది. తాజాగా ప్రియ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో తన స్నేహితుడైన నకుల్‌తో కనిపించిందీ నటి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి