- ఏపీ సహా 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరం.. 'ది ప్రింట్' కథనం
The Print Article: ఆంధ్రప్రదేశ్ సహా దేశంలోని 5 రాష్ట్రాల అప్పుల పరిస్థితి ఆందోళనకరంగా ఉందని... "ది ప్రింట్” సంచలనాత్మక కథనం ప్రచురించింది. అధికారిక అప్పుల ఆధారంగా ఆ జాబితాలో ఆంధ్ర నాలుగో స్థానంలో ఉన్నట్లు తెలిపింది. కార్పొరేషన్ల రుణాలు, వాస్తవ లెక్కలు, ఇతర భారాలు లెక్కిస్తే మనదే మొదటి స్థానం ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. ఇప్పడే మేల్కోకపోతే మనకూ శ్రీలంక గతి తప్పదని హెచ్చరిస్తున్నారు.
- EX-IAS PV RAMESH: ప్రభుత్వం డబ్బు పంచే తమాషాలు ఇక ఆపాలి!
EX-IAS PV RAMESH: చరిత్రలో ఎప్పుడూ లేనంత తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని శ్రీలంక ఎదుర్కొంటోంది. మనకీ ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే రాష్ట్ర ప్రభుత్వమైనా, కేంద్ర ప్రభుత్వమైనా కేవలం డబ్బులు పంచడం మాత్రమే కాకుండా అభివృద్ధి రేటు, పెట్టుబడులు, సంక్షేమ కార్యక్రమాల మధ్య ప్రభుత్వం సమతుల్యం సాధించాలని విశ్రాంత ఐఏఎస్ అధికారి పీవీ రమేష్ వ్యాఖ్యానించారు.
- పోరస్ పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలంటూ.. కదంతొక్కిన గ్రామస్థులు
ప్రాణసంకటంగా మారిన పోరస్ పరిశ్రమను శాశ్వతంగా మూసేయాలంటూ ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెం ప్రజలు పోరాటం ఉద్ధృతం చేశారు. ఫ్యాక్టరీలో పనులు జరుగుతున్నాయంటూ పెద్దసంఖ్యలో చేరుకున్న గ్రామస్థులు.. ఉత్పత్తి ఆపాలంటూ గేటు బద్ధలు కొట్టుకుని లోపలికి దూసుకెళ్లారు. ఆందోళనకారులను పోలీసులు అడ్డుకునేందుకు యత్నించే క్రమంలో తీవ్రమైన తోపులాట జరిగింది.
- థర్మల్ కేంద్రాల్లో ఉత్పత్తి కష్టాలు... బొగ్గు లేదు.. డబ్బుల్లేవు!
ప్రభుత్వ ప్రణాళికా లోపంతో రాష్ట్రం అంధకారంగా మారిపోయింది. ముందుచూపు కొరవడటంతో పరిశ్రమలు విద్యుత్ కోతలతో అల్లాడుతున్నాయి. థర్మల్ విద్యుత్ ప్లాంట్లు పూర్తి సామర్థ్యంతో పనిచేయడానికి బొగ్గు లేదు. బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనడానికి డబ్బులు లేవు. వెరసి సుమారు దశాబ్ద కాలం తర్వాత పరిశ్రమలకు విద్యుత్ విరామాన్ని ప్రకటించాల్సి వచ్చింది.
- రాష్ట్రపతి ఎన్నికల్లో గెలుపెవరిదో? విపక్షాలు కలిసి నడిస్తే విజయం తథ్యం!
రాష్ట్రపతి ఎన్నికల్లో విజయం కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలకు పదునుపెడుతున్నాయి. ఎన్డీఏకు సొంతంగా అవసరమైన మెజారిటీ లేదు. విపక్షాలు ఉమ్మడిగా కలిసి నడిస్తే విజయతీరాలకు చేరుకోగలవు. దీంతో పోటీ రసవత్తరంగా మారింది.
- 'పెళ్లై ఏడాదైనా కాకుండా విడాకులా?.. అది అసాధరణ కష్టం కాదు'
Delhi High Court: పెళ్లి అయి ఏడాది కూడా పూర్తవ్వకుండానే విడాకులు కోరిన ఓ జంట విజ్ఞప్తిని దిల్లీ హైకోర్టు తిరస్కరించింది. సంయోగ సంబంధానికి నిరాకరించడం విడాకులకు కారణమైనప్పటికీ, క్రూరత్వంగా పరిగణించినప్పటికీ.. దాన్ని అసాధారణ కష్టంగా పరిగణించలేమని పేర్కొంది. ఏడాది తర్వాతే కోర్టును ఆశ్రయించాలని తెలిపింది.
- మరో ప్రచ్ఛన్న యుద్ధం! అమెరికా ఆధిపత్యానికి తెర?
మొదట కొవిడ్, తాజాగా ఉక్రెయిన్ యుద్ధం- ప్రపంచమంతటా చమురు, ఆహార ధాన్యాలు, వ్యాపార సరకుల ఉత్పత్తి, సరఫరా తీరును మార్చేస్తున్నాయి. ప్రపంచీకరణను వెనక్కుతిప్పే ధోరణి డొనాల్డ్ ట్రంప్ హయాములోనే మొదలై తాజాగా మరింత ఊపందుకుంది. ఈ సంక్షోభం సమూల మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉంది.
- GST Rationalisation: జీఎస్టీ రేటు పెంచడం లేదు: కేంద్రం
GST Rationalisation: జీఎస్టీ స్లాబ్ రేట్ల మార్పు వార్తల్లో నిజం లేదని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రేట్ల హేతుబద్దీకరణ కమిటీ ఇంకా నివేదిక సమర్పించలేదని తెలిపాయి.
- Cristiano Ronaldo: ఫుట్బాల్ స్టార్ రొనాల్డో ఇంట విషాదం
Cristiano Ronaldo: పోర్చుగల్ ఫుట్బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఇంట తీవ్ర విషాదం నెలకొంది. జార్జినా-రొనాల్డో దంపతులకు అప్పుడే జన్మించిన కవలల్లో ఒకరు మృతిచెందారు.
- విజయ్-సమంత.. విక్రమ్-మురుగదాస్ కాంబోకు ప్లాన్!
'మహానటి' తర్వాత విజయ్ దేవరకొండ-సమంత జంటగా కలిసి మరో చిత్రంలో నటించేందుకు సిద్ధమయ్యారని తెలిసింది. మరోవైపు తమిళంలో విక్రమ్-మురుగదాస్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కబోతుందని సినీవర్గాల నుంచి సమాచారం అందుతోంది.