- CBI CHARGE SHEET: వివేకాను అవినాష్ రెడ్డే హత్య చేయించారా?
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డిని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి.. తన అనుచరుడైన దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి ద్వారా హత్య చేయించారన్న అనుమానం ఉందని సీబీఐ పేర్కొంది. ఆ కోణంలో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు వెల్లడించింది. కడప లోక్‌సభ నియోజకవర్గం టికెట్టు అవినాష్‌రెడ్డికి కాకుండా తనకు లేదా వైఎస్ షర్మిల, విజయమ్మల్లో ఎవరికైనా ఒకరికి రావాలని వివేకానందరెడ్డి ఆకాంక్షించారని, ఈ నేపథ్యంలోనే అవినాష్‌రెడ్డి ఆయన్ను హత్య చేయించి ఉంటారనే అనుమానం ఉందని వివరించింది.
- CM REVIEW:రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స
రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందేలా నెట్వర్క్ ఆసుపత్రులను ప్రోత్సహించాలని రహదారి భద్రత మండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. బాధితులకు ఆధునిక పద్ధతుల్లో అత్యవసర సేవలు అందించాలని, ఇందుకోసం కొత్తగా ఏర్పాటవుతున్న జిల్లాలకు అనుగుణంగా ప్రతి జిల్లాలోనూ ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి జగన్ ఆదేశించారు.
- CHANDRABABU NAIDU: జగన్... ప్రత్యేక హోదా కోసం యుద్ధం ఎప్పుడు?
రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించలేకపోవడం ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి అసమర్థతకు, లాలూచీకి నిదర్శనమని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా సాధిస్తానంటూ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఊరూరూ తిరిగి హడావుడి చేసిన జగన్ ఇప్పుడు మౌనంగా ఎందుకు ఉండిపోయారని ఆయన మండిపడ్డారు. ప్రత్యేక హోదా కోసం ముఖ్యమంత్రి యుద్ధం ఎప్పుడు మొదలు పెట్టబోతున్నారని ప్రశ్నించారు.
- banks:బ్యాంకులూ.. జాగ్రత్త...ఏపీలో కార్పొరేషన్లకు రుణాలపై కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిక
BANK LOANS: ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలోని కార్పొరేషన్లకు రుణాలు ఇచ్చే సందర్భంలో ఆచితూచి వ్యవహరించాలని కేంద్ర ఆర్థికశాఖ జాతీయ బ్యాంకులకు మార్గనిర్దేశం చేసినట్లు తెలిసింది. ఆ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్ (ఏపీఎస్డీసీ)తోపాటు ఇతర కార్పొరేషన్లకు బ్యాంకుల నుంచి రుణాలు అందడం సంక్లిష్టమైంది. రుణాలిచ్చేందుకు అంగీకరించి, ఒప్పందాలు కుదుర్చుకుని, తనఖా ఒప్పందాలు, రిజిస్ట్రేషన్లు పూర్తి చేసిన ఏపీఎస్డీసీ అప్పు విషయంలోనూ బ్యాంకులు వెనకడుగు వేస్తున్నాయి.
- ఇన్‌స్పైర్‌శాట్-1 రూపకర్తల్లో ఇద్దరు మన విద్యార్థులే
ఇన్స్పైర్ శాట్-1 ఉపగ్రహ రూపకల్పనలో తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు విద్యార్థులు ప్రతిభ చాటారు. తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో బీటెక్ చివరి సంవత్సరం చదువుతున్న.. ధ్రువ అనంత దత్తా , అమన్ నవీన్.... మరో నలుగురితో కలిసి శ్రీహరికోటలో ఈనెల 6, 7, 8 తేదీల్లో రాకెట్‌పైకి వెళ్లి ఉపగ్రహాన్ని అమర్చారు.
- 'ఈ ఎన్నికల్లో ప్రయోగాలు వద్దు'.. పంజాబ్ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి
Rahul Gandhi Punjab: ఎన్నికల్లో ప్రయోగాలు చేయవద్దని పంజాబ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. పంజాబ్‌పై పూర్తి అవగాహన ఉన్న కాంగ్రెస్ మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే డ్రగ్స్ సమస్యను అంతం చేస్తుందన్నారు.
- 'మా మీద రష్యా దాడి అప్పుడే'.. ఉక్రెయిన్ అధ్యక్షుడి ప్రకటన!
Ukraine Russia News: రష్యా తమ దేశం మీద మరికొన్ని గంటల్లో దాడికి దిగుతుందని ప్రకటించారు ఆ దేశ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్ స్కీ. సరిహద్దులో భారీ ఎత్తున రష్యన్ బలగాలు మోహరించిన నేపథ్యంలో అధ్యక్షుడి చేసిన వ్యాఖ్యలు స్థానికుల్లో మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ రాజధానిలోని అమెరికా రాయబారా కార్యాలయాన్ని వేరే ప్రాంతానికి తరలిస్తున్నట్లు ప్రకటించారు ఆ దేశ విదేశాంగ మంత్రి బ్లింకెన్.