- 28 మంది ఎంపీలు ఉండి 32 నెలల్లో ఏం చేశారు: చంద్రబాబు
తెదేపా ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రాబాబు ఆన్లైన్ సమావేశం నిర్వహించారు. ఆర్థిక ఉల్లంఘనలతో రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి పోతోందని.. ఈ పరిణామాలపై కేంద్రం స్పందించాలన్నారు.
- Employees Protest Rally: సచివాలయంలో ఉద్యోగులు నిరసన ర్యాలీ
ప్రభుత్వం ఇచ్చిన రివర్స్ పీఆర్సీ వద్దంటూ.. వెనక్కి నడుస్తూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. ప్రభుత్వం సామరస్యంగా వ్యవహరించకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందన్న పీఆర్సీ సాధన సమితి నేత వెంకట్రామిరెడ్డి.. సోమవారం నుంచి సచివాలయంలో రీలే నిరాహారదీక్షలు ప్రారంభిస్తామని హెచ్చరించారు.
- Committee on PRC: 'చర్చలతోనే సమస్య పరిష్కారం.. ఉద్యోగులు గుర్తించాలి'
చర్చలతోనే సమస్య పరిష్కారం అవుతుందనే విషయం ఉద్యోగులు గుర్తించాలని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఉద్యోగ సంఘాలు మొండి పట్టుదలకు పోతే ఉపయోగం లేదని పేర్కొన్నారు.
- రాష్ట్రంలో కొనసాగుతున్న కరోనా ఉద్ధృతి.. ఒక్కరోజే 12,561 కరోనా కేసులు, 12 మరణాలు
రాష్ట్రంలో రోజురోజుకు కరోనా విజృంభిస్తోంది. గడిచిన 24 గంటల్లో 40,635 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 12,561 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.
- 'నా హెలికాప్టర్‌కు అనుమతివ్వలేదు.. భాజపా కుట్రే'
తన హెలికాప్టర్ టెకాఫ్ అయ్యేందుకు అనుమతించలేదని, దిల్లీలోనే చిక్కుకుపోయానని ట్వీట్ చేశారు సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్. ముజఫర్‌నగర్ ఎన్నికల కార్యక్రమానికి వెళ్లేందుకు అనుమతించకపోవటం భాజపా ఉద్దేశపూర్వక కుట్రేనని ఆరోపించారు.
- పంట పొలాల్లో కూలిన సైనిక విమానం.. పైలట్లు సురక్షితం
బిహార్‌లో భారత సైన్యానికి చెందిన శిక్షణ విమానం అకస్మాత్తుగా కూలిపోయింది. విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడినట్లు సైనిక ఉన్నతాధికారులు వెల్లడించారు.
- ఇద్దరు చిన్నారుల దారుణ హత్య.. కనుగుడ్లు తీసి..
ఇద్దరు చిన్నారులను దారుణంగా హత్య చేసి చేరో కన్నును తొలగించిన విషాద ఘటన ఝార్ఖండ్, పాకుడ్ జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
- Union Budget 2022: బడ్జెట్‌తో 'ఎలక్ట్రిక్'కు మరింత కిక్!
పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరగడం వల్ల దేశంలో ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు ఆదరణ పెరిగింది. భారత్ నిర్దేశించుకున్న పర్యావరణ లక్ష్యాల సాధనకు ఈ రంగాన్ని ప్రోత్సాహించాల్సిన అవసరం ఉంది.