ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM

.

Top News @ 5 PM
ప్రధాన వార్తలు @ 5 PM
author img

By

Published : Jul 9, 2020, 4:58 PM IST

  • ఏడాదిన్నరలో పనులు పూర్తి కావాలి

నిధుల సమీకరణపై కచ్చితమైన ప్రణాళిక ఉండాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేపట్టిన పనులకు నిధుల సమీకరణపై సమీక్ష నిర్వహించిన సీఎం... లక్ష్యం నిర్దేశించుకుని వేగంగా పనులు చేయాలని దిశానిర్దేశం చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • వివాదంపై విచారణ

తితిదే సప్తగిరి మాస పత్రిక వివాదంపై తిరుపతి పోలీసులు విచారణ జరుపుతున్నారు. గుంటూరుకు చెందిన ఓ భక్తునికి సప్తగిరి పత్రికతో పాటు సువార్త పత్రిక వచ్చింది. దీనిపై విమర్శలు వచ్చిన నేపథ్యంలో తితిదే విచారణకు ఆదేశించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • మనం కంట్రోల్ తప్పితే.. అది తప్పుతుంది

కరోనా రోగులకు ఇంట్లోనే వైద్యం పొందే విధానాన్ని ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని రాష్ట్ర కోవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రత్యేకాధికారి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. గాలి ద్వారా కరోనా వ్యాపించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని స్పష్టం చేశారు. ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తగు జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను కట్టడి చేయవచ్చని చెబుతున్న ప్రభాకర్ రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి

  • ఎగువ ప్రాంతాల నుంచి వరద

ఎగువ ప్రాంతాల్లో కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద వస్తోంది. రాజమహేంద్రవరం వద్ద నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.6 అడుగుల నీటి మట్టం నమోదైంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ఆ ప్రచారం తగదు

సీబీఎస్​ఈ సిలబస్ నుంచి ప్రజాస్వామ్యం, బహుళత్వం, పౌరసత్వం, జాతీయవాదం, లౌకికవాదం లాంటి పలు అంశాలను తొలగించడంపై వెల్లువెత్తుతున్న విమర్శలపై కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పందించారు. కరోనా నేపథ్యంలోనే సిలబస్ తగ్గించామని.. ఈ అంశాన్ని తప్పుగా చిత్రీకరించవద్దని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 'కేరళ' సాయం కోరిన 'కేంద్రం'

కేరళలో సంచలనం సృష్టించిన బంగారం స్మగ్లింగ్ కేసులో ప్రధాన నిందితురాలిని పట్టుకునేందుకు రాష్ట్ర పోలీసుల సహకారం కోరాయి కేంద్ర సంస్థలు. ఈ మేరకు కేరళ పోలీసులకు ఓ లేఖ రాసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • 10,800 పైకి నిఫ్టీ

స్టాక్ మార్కెట్లు చివరి సెషన్ నష్టాల నుంచి గట్టెక్కి.. గురువారం భారీ లాభాలను గడించాయి. సెన్సెక్స్ 409 పాయింట్లు బలపడింది. నిఫ్టీ 108 పాయింట్లు పుంజుకుంది. ఎఫ్​ఎంసీజీ మినహా దాదాపు అన్ని రంగాలు సానుకూలంగా ముగిశాయి. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • భారీ ప్లాన్​ రెడీ చేస్తున్న ట్రంప్!

చైనాపై అదనపు చర్యలు చేపట్టనున్నట్టు అమెరికా ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ చర్యలు ఎలా ఉండనున్నాయనే దానిపై ఎలాంటి స్పష్టతనివ్వలేదు. కరోనా వైరస్​, హాంగ్​కాంగ్​, టిబెట్​ భద్రతా వ్యవహారాల నేపథ్యంలో శ్వేతసౌధం ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • ​ రద్దయిందా.. మాకు తెలియదే!

ఆసియా కప్​ రద్దయిన విషయంపై తమకు ఎలాంటి సమాచారం లేదంటోంది పాకిస్థాన్​ క్రికెట్​ బోర్డు (పీసీబీ). టోర్నీ రద్దయిందని బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ తాజాగా వెల్లడించిన నేపథ్యంలో పీసీబీ ఈ విధంగా స్పందించింది. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

  • నవ్వుల్ని పంచారు

బాలీవుడ్ హాస్యనటుడు జగదీప్​ మరణంపై సంతాపం తెలిపిన పలువురు బాలీవుడ్ ప్రముఖులు.. తమకు జీవితాంతం గుర్తుండిపోయే నవ్వుల్ని అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.