- Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ జాప్యంపై సీఆర్డీఏకు లీగల్ నోటీసులు
Legal Notice to CRDA: హ్యాపీనెస్ట్ నిర్మాణంలో జాప్యంపై.. సీఆర్డీఏకు 28 మంది లీగల్ నోటీసులు పంపించారు. 2021 డిసెంబర్ 31 నాటికి ప్లాట్లు అందజేయాలని ఒప్పందం జరిగిందని.. గడువు తీరినప్పటికీ ఫ్లాట్లు అప్పగించకపోవటంతో.. చెల్లించిన 10శాతం సొమ్మును 14శాతం వడ్డీతో సహా చెల్లించాలని నోటీసుల్లో కోరారు. అలాగే 20 లక్షల పరిహారం ఇవ్వాలని పేర్కొన్నారు. లేదంటే రెరా సీఆర్డీఏపై చట్టం కింద కేసు వేస్తామంటుని హ్యాపీనెస్ట్ కొనుగోలుదారులు స్పష్టం చేశారు. ఈ మేరకు న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ ద్వారా.. సీఆర్డీఏ అధికారులకు నోటీసులు పంపించారు.
- PRC: జీతం నుంచి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తాం.. ప్రభుత్వానికి హైకోర్టు హెచ్చరిక
AP High Court on PRC: పీఆర్సీ వ్యవహారంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఉద్యోగస్తులకు నష్టం చేకూరేలా జీవోలున్నాయని పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయస్థానం.. ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషనర్‌కు ఇవ్వాలని ఆదేశించింది.
- ఒక పోస్టు కోసం భర్తీ చేసుకుని... మరో పోస్టులో ఎలా నియమిస్తారు? ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు
ఒక పోస్టు కోసం భర్తీ చేసుకున్న వారిని మరో పోస్టులో ఎలా నియమిస్తారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. మహిళా రక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా ప్రభుత్వం మార్చటంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. పోలీసు నిబంధనలు ప్రకారం ఫిజికల్ పిట్నెస్, శిక్షణ లాంటి అంశాలు ఉంటాయి కదా అని గుర్తు చేసింది.
- Yerrannaidu Birth Anniversary: 'జాతీయ రాజకీయాల్లో ఎర్రన్నాయుడు తనదైన ముద్ర వేశారు'
Yerrannaidu Birth Anniversary: తెదేపా సీనియర్ నేత దివంగత ఎర్రన్నాయుడు జయంతి సందర్భంగా.. పార్టీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌లు నివాళులర్పించారు.
- Actor Naresh About His Wife : 'నా భార్యతో నాకు ఎలాంటి సంబంధం లేదు'
Actor Naresh About His Wife :తన భార్య రమ్యరఘుపతితో తనకు ఎలాంటి సంబంధం లేదని 'మా' మాజీ అధ్యక్షుడు, సీనియర్ నటుడు నరేశ్ స్పష్టం చేశారు. ఆమె జరిపే వ్యాపార, ఆర్థిక వ్యవహారాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. రమ్య రఘుపతి రూ.లక్షల్లో అప్పులు తీసుకుని తిరిగి చెల్లించట్లేదంటూ బాధితులు మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో తనకు రెండుమూడ్రోజుల నుంచి చాలా ఫోన్లు వస్తున్నాయని నరేశ్ తెలిపారు. ఈ క్రమంలోనే ఆమెతో తనకు ఎలాంటి సంబంధం లేదని నరేశ్ క్లారిటీ ఇచ్చారు.
- Fire Accident: వెంకటగిరి వద్ద గూడ్స్ రైలులో పొగలు.. తప్పిన పెను ప్రమాదం
నెల్లూరు జిల్లా వెంకటగిరి రైల్వే స్టేషన్లో బొగ్గు లోడ్‌తో వెళ్తున్న గూడ్స్ రైలులోని ఒక బోగిలో మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన రైల్వే అధికారులు.. అగ్నిమాపక సిబ్బంది సాయంతో మంటలను ఆర్పేశారు.
- ఇంట్లోంచి లాక్కొచ్చి ప్రేమికులపై తూటాల వర్షం.. పరువు పేరుతో...
Honor killing: ప్రేమికులను ఇంట్లోంచి లాక్కొచ్చి వారిపై తూటాల వర్షం కురిపించారు యువతి కుటుంబ సభ్యులు. ఆపై యువకుడి తలపై ఇటుకరాయితో దాడి చేసి, పరారయ్యారు. ఈ దాడిలో ఇరువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ పరువు హత్య ఉత్తర్‌ప్రదేశ్ షాజహాన్‌పుర్ జిల్లాలో మంగళవారం జరిగింది.
- బంగారం ధరలకు రెక్కలు.. ఒక్కరోజే భారీగా జంప్
Gold rate today: బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. బుధవారం పది గ్రాముల పసిడి రూ.652 మేర పెరిగింది. ప్రస్తుతం పసిడి ధర ఎంత ఉందంటే?
- భారత యువ గ్రాండ్‌మాస్టర్‌కు షాక్.. నాకౌట్ చేరకుండానే..
Airthings Masters: భారత గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానందకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఎయిర్‌థింగ్స్ మాస్టర్స్‌లో ప్రపంచ నెం.1 చెస్ ఛాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌ను ఓడించిన అతడు నాకౌట్ చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
- లంకకు భారీ షాక్.. భారత్‌తో సిరీస్‌కు స్టార్ ఆల్‌రౌండర్ దూరం
Ind vs SL: భారత్‌తో టీ20 సిరీస్ జరగనున్న వేళ శ్రీలంక జట్టుకు షాక్ తగిలింది. ఆ జట్టు ఆల్‌రౌండర్ వనిందు హసరంగ మరోసారి కరోనా బారిన పడ్డాడు. దీంతో అతడు ఐసోలేషన్‌కే పరిమితంకానున్నాడు.