ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11AM

ప్రధాన వార్తలు @ 11AM

top news at 11am
ప్రధాన వార్తలు @ 11AM
author img

By

Published : Jan 25, 2021, 11:00 AM IST

  • వారికి ముందే తెలుసా... చనిపోతున్నారని?

చిత్తూరు జిల్లా మదనపల్లిలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులుగా భావిస్తున్న మృతుల తల్లి, తండ్రిని పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వైకాపా ఎంపీలతో సీఎం జగన్ భేటీ

వైకాపా ఎంపీలతో ఉదయం 11 గంటలకు సీఎం జగన్ భేటీ కానున్నారు. పార్లమెంట్‌ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారు. బడ్జెట్ సమావేశాల్లో ప్రస్తావించిన అంశాలపై వైకాపా ఎంపీలకు దిశా నిర్దేశం చేయనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • సుప్రీంలో 'స్థానిక సమరం'.. నేడే విచారణ.. మారిన ధర్మాసనం!

గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు అనుమతిస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దాఖలు చేసిన కేసును విచారించనున్న సుప్రీంకోర్టు ధర్మాసనం మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి.

  • కొవిడ్ ప్రభావంలోనూ... ఇతర రాష్ట్రాల్లో నిరాటంకంగా ఎన్నికలు

ప్రస్తుతం పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ మధ్య ఉత్కంఠ వాతావరణం కొనసాగుతోంది. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • మనీలాండరింగ్​ కేసులో ఇద్దరు చైనీయులు అరెస్టు

మనీలాండరింగ్​ కేసులో ఇద్దరు చైనీయులను ఉత్తర్​ప్రదేశ్​ ఉగ్రవాద నిరోధక బృందం(ఏటీఎస్​) శనివారం అరెస్టు చేసింది. నకిలీ ధ్రువపత్రాలను ఉపయోగించి బ్యాంకు ఖాతా తెరిచేందుకు యత్నించగా నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పాత సామాన్ల దుకాణంలో 300 ఆధార్ కార్డులు

కేరళ కట్టాక్కాడలోని ఓ పాతసామాన్లు కొనుగోలు చేసే దుకాణంలో 300లకు పైగా ఆధార్​ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గత వారం వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • దేశవ్యాప్తంగా మరో 13,203 కరోనా కేసులు

దేశంలో మరో 13,203 మందికి కరోనా సోకింది. కొవిడ్​ బారినపడిన వారిలో మరో 131 మంది మృతిచెందారు. 13 వేలమందికిపైగా వైరస్​ నుంచి కోలుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'ఫైజర్'​కు ఆస్ట్రేలియా ఓకే- ఫిబ్రవరి నుంచి వ్యాక్సినేషన్

ఆస్ట్రేలియాలో మొదటి కొవిడ్​ టీకా వినియోగానికి అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది. అయితే.. మిగతా దేశాలన్నీ అత్యవసర వినియోగానికి మాత్రమే అనుమతించగా.. ఆస్ట్రేలియా సమగ్ర వినియోగానికి ఆమోదం తెలపడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విమాన ప్రమాదం- నలుగురు ఫుట్​బాలర్లు మృతి

బ్రెజిల్​లోని టొకాన్టిన్ రాష్ట్రంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు ప్రముఖ ఫుట్​బాలర్లు మృతిచెందారు. ప్రమాదానికి గల కారణాలు తెలియలేదు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • వాళ్ల కష్టాలు చూశా.. అందుకే నటించలేదు: సునీత

అవకాశాలొచ్చినా సరే నటించకపోవడానికి గల కారణాల్ని వెల్లడించింది సింగర్ సునీత. వీటితో పాటే పలు ఆసక్తికర విషయాల్ని పంచుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.