- CHANDRABABU TOUR : నేటి నుంచి కుప్పంలో చంద్రబాబు పర్యటన
చిత్తూరు జిల్లా కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు...మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. నేటి నుంచి శనివారం వరకు పలు గ్రామాల్లో రోడ్ షో నిర్వహిస్తారు. ఈ మేరకు ఇవాళ ఉదయం హైదరాబాద్ నుంచి బెంగళూరు విమానాశ్రయం చేరుకుని, అక్కడి నుంచి రోడ్డు మార్గంలో దేవరాజపురం రానున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Ap corona cases : పెరుగుతున్న కరోనా కేసులు... ఆందోళనకర రీతిలో ఒమిక్రాన్
రాష్ట్రంలో కొత్తగా 434 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1,848 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. తాజాగా.. 102 మంది బాధితులు మహమ్మారిని జయించి కోలుకున్నారు. మరోపక్క కొత్తగా నాలుగు ఒమిక్రాన్ కేసులు వెలుగులోకి రాగా ఆ వేరియంట్ మొత్తం కేసులు 28కి చేరాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- CBN-HC : సీఐడీ కేసులో స్టే పొడిగింపు
తెలుగుదేశం అధినేత చంద్రబాబు, మాజీ మంత్రి పి.నారాయణపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు మరో ఆరు వారాలు పొడిగించింది. విచారణను నాలుగు వారాలకు వాయిదా వేస్తూ ధర్మాసనం ఆదేశాలిచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- YOUNG MAN SUICIDE : పోలీసులు కొట్టారని దళిత యువకుడి ఆత్మహత్య..!
తూర్పుగోదావరి జిల్లా బలుసులపేటకు చెందిన ఓ దళిత యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వైకాపాకు వ్యతిరేకంగా ఎన్నికల్లో పోటీ చేశానన్న కక్షతో, తప్పుడు కేసు పెట్టించి, పోలీసులతో కొట్టించి తన తమ్ముడి చావుకు కారణమయ్యారంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. సామర్లకోట ఠాణా వద్ద మృతదేహంతో ఆందోళన చేయడంతో స్థానికంగా ఉద్రిక్తత ఏర్పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి కారణమిదే!
భారత త్రివిధ దళాధిపతి జనరల్ బిపిన్ రావత్ హెలికాప్టర్ ప్రమాదానికి సాంకేతిక లోపం లేదా విద్రోహచర్య కారణం కాదని దర్యాప్తు నివేదికలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన నివేదిక కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఈ ఏడాది 77 మంది రాజ్యసభ సభ్యుల పదవీ విరమణ
2022లో రాజ్యసభ సభ్యులు మొత్తం 77 మంది పదవీ విరమణ చేయనున్నట్లు తెలిపింది రాజ్యసభ సచివాలయం. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు, తెలంగాణ నుంచి ఇద్దరు ఎంపీలు ఉన్నారు. కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, పీయూష్ గోయల్ వంటి ప్రముఖుల పదవీ కాలం సైతం ఈఏడాదే ముగియనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Azadi ka amrit mahotsav: ఐక్య భారత్ ఆగిందిలా!
పాకిస్థాన్, బంగ్లాదేశ్‌తో కూడిన ఐక్య భారత్ ఏర్పడి ఉంటే ఎలా ఉండేది? ఇప్పుడు ఊహించటం ఎలా ఉన్నా.. అది దాదాపు సాధ్యంలానే కన్పించింది. దేశానికి స్వాతంత్య్రం ఖరారయ్యాక... ఒక దశలో ఇదే దాదాపు ఖాయమైంది. కానీ తెరవెనక రాజకీయాలతో అది తేలిపోయింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సింహాన్ని మోసుకెళ్లిన మహిళ.. వీడియో వైరల్
సింహాన్ని దూరం నుంచి చూస్తేనే హడలెత్తి పరుగులు తీస్తాం. అలాంటిది ఓ మహిళ ఏ మాత్రం భయం లేకుండా తల్లి.. బిడ్డను ఎత్తికెళ్లినట్లు.. సింహాన్ని మోసుకెళ్లింది. కువైట్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'కోహ్లీ వందో టెస్టుకు అలా జరగాలని ఆశిస్తున్నా'
కోహ్లీ వందో టెస్టుకు స్డేడియంలోకి ప్రేక్షకులను అనుమతిస్తారని ఆశిస్తున్నట్లు అన్నాడు దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్. అభిమానులు లేచి నిలబడి చప్పట్లతో చేసే అభినందనలకు విరాట్ అర్హుడని చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Raviteja daksha: రవితేజకు విలన్‌గా హాట్‌బ్యూటీ
రవితేజ కొత్త సినిమాలో విలన్‌గా హాట్బ్యూటీని ఎంపిక చేయాలని చిత్రబృందం చూస్తోంది. దాదాపు ఖరారైపోయినట్లేనని తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి