ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9AM
ప్రధాన వార్తలు @ 9AM
author img

By

Published : Jan 5, 2022, 9:01 AM IST

  • KABADDI : తిరుపతిలోనూ కబడ్డీ కూత!...5 రోజులూ జాతీయస్థాయి మజా

కబడ్డీ... కబడ్డీ... కబడ్డీ... ఈ కూతలో ఉండే కిక్కే వేరు.. ఒక్కసారిగా మనల్నీరంగంలోకి దింపేస్తుంది.! గుక్క తిప్పుకోకుండా పాయింట్లు వేటాడేయాలనిపిస్తుంది.! ఇలా వీక్షకులకు ఎంతో ఉత్సాహాన్నిచ్చే ఈ కూత. ఇవాళ్టి నుంచి తిరుపతిలోనూ వినిపించనుంది. ఐదు రోజుల పాటు జరిగే జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో 22 రాష్ట్రాల నుంచి 43 జట్లు పాల్గొననున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Sidheswara Temple: ఆ ఆలయంలో నాలుగు చేతులతో శివుడు దర్శనం.. ఎక్కడంటే..!

శివాలయాల్లో సహజంగా పరమేశ్వరుడు లింగాకారంలో దర్శనమిస్తారు. కానీ ఆ ఆలయంలో శివుడు చతుర్భుజాకారంలో భక్తులను ఆశీర్వదిస్తూ కనిపిస్తాడు. ఎన్నో విశిష్టతలు కలిగిన ఈ గుడి శిథిలావస్థకు చేరడంతో భక్తులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. వసతులు లేని అనంతపురం జిల్లాలోని సిద్ధేశ్వరస్వామి ఆలయంపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం

  • PEDDA BALA SHIKSHA : తెలుగు సంస్కృతి, భాషా వారసత్వ సంపదకు ప్రతిరూపం... పెద్ద బాలశిక్ష..!

పెద్ద బాల శిక్ష.....! తెలుగు వారికి మాత్రమే సొంతమైన అరుదైన పుస్తకం. ఒకప్పుడు ప్రతి తెలుగువారి ఇంట్లో కచ్చితంగా దర్శనమిచ్చే ఈ విజ్ఞానపు గని బ్రిటీషు కాలంలో పాఠ్యపుస్తకంగా ఉండేది. తెలుగు భాష, సంస్కృతికి రక్షణగా నిలిచే ఈ పుస్తకాన్ని నేటి తరానికి చేరువ చేసేందుకు అనేక ఏళ్లుగా ఆలుపెరగని ప్రయత్నం చేస్తున్నారు. ఆర్థిక సమస్యలతో పోరాటం చేస్తున్నారు గాజుల సత్యనారాయణ. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పంజాబ్​కు ప్రధాని మోదీ- 10 వేల మంది సిబ్బందితో భద్రత

త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్​లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. రెండేళ్ల తర్వాత పంజాబ్‌లో కాలు మోపనున్న మోదీ.. సరిహద్దు జిల్లా పిరోజ్​పుర్​ను సందర్శిస్తారు. ఈనేపథ్యంలో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. 10 వేల మంది సిబ్బంది సహా యాంటీ డ్రోన్​ బృందాన్ని కూడా మోహరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆయన నుంచి చాలా నేర్చుకున్నా'.. జస్టిస్ సుభాష్ రెడ్డిపై సీజేఐ ప్రశంసలు

సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసి మంగళవారం పదవీ విరమణ చేసిన జస్టిస్ సుభాష్ రెడ్డిని.. సీజేఐ జస్టిస్ ఎన్​వీ రమణ ప్రశంసలతో ముంచెత్తారు. వివిధ హైకోర్టులు, సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా 20 ఏళ్ల పాటు సేవలందించి.. ప్రజల స్వేచ్ఛను రక్షించారని కొనియాడారు. నిబద్ధత కలిగిన న్యాయమూర్తిగా ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బూస్టర్‌ డోసుగా భారత్‌ బయోటెక్‌ చుక్కల మందు టీకా

రెండు డోసుల కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా తీసుకున్న వారికి 'బూస్టర్‌ డోసు' కింద ఈ చుక్కల మందు టీకా అనువైనదని భారత్‌ బయోటెక్‌ పేర్కొంది. అందుకు అవసరమైన క్లినికల్​ పరీక్షల నిర్వహణ అనుమతి ఇవ్వాలని డ్రగ్​ కంట్రోలర్​ జనరల్​ ఆఫ్​ ఇండియాకు దరఖాస్తు చేసుకోగా.. ఈ అంశాన్ని సబ్జెక్టు నిపుణుల కమిటీ పరిశీలిస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Azadi Ka Amrit Mahotsav: రతన్‌జీకి ప్రవేశం లేదంటే.. 'తాజ్‌' పుట్టింది!

ముంబయి అనగానే... గుర్తొచ్చే వాటిలో ఒకటి తాజ్‌ హోటల్‌! దేశవిదేశాల్లో పేరు సంపాదించిన తాజ్‌ హోటల్‌ బ్రాండ్‌ వెనక... ఆంగ్లేయుల అవమానం... భారతీయ సంస్కారం దాగున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • WHO Omicron: 'ఒక్కో దేశంలో ఒక్కోలా ఒమిక్రాన్​'

కొవిడ్​ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ ప్రభావం ఒక్కో దేశంలో ఒక్కోలా ఉండొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) నిపుణులు డాక్టర్ అబ్దీ మహముద్​ పేర్కొన్నారు. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్​తో ఆస్పత్రిపాలయ్యే పరిస్థితి, మరణాలు తక్కువగా ఉన్నంత మాత్రానా.. ఇతర దేశాల్లో ఇదే తరహాలో ఉంటుందని భావించకూదన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • Australian Open 2022: జకోవిచ్​పై వీడిన ఉత్కంఠ

ఈ నెల 17న ప్రారంభంకానున్న ఆస్ట్రేలియన్​ ఓపెన్​లో జకోవిచ్​ ఆడతాడా? లేదా? అన్న సందిగ్ధతకు తెరపడింది. 'మినహాయింపు అనుమతి' లభించడం వల్ల కరోనా టీకా వేసుకోకుండానే ఈ మెగాటోర్నీలో పాల్గొంటున్నట్లు అతడు తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అల్లు అర్జున్ 'పుష్ప' స్టన్నింగ్: మహేశ్​బాబు

సూపర్​స్టార్ మహేశ్​బాబు 'పుష్ప' సినిమా చూశారు. హీరో అల్లు అర్జున్​, డైరెక్టర్ సుకుమార్​ను తెగ ప్రశంసించారు. మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదంటూ ట్వీట్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.