ETV Bharat / city

ఇవాళ ఆటోలు, లారీలు, క్యాబ్​ల బంద్..! - Auto cabs lorry bundh in hyderabad

Auto-Cabs Bundh: నేటి అర్ధరాత్రి నుంచి 24 గంటలపాటు ఆటోలు, క్యాబ్​లు, లారీల సేవలు నిలిచిపోనున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నూతన మోటర్ వాహనాల చట్టం అమలు చేస్తూ జరిమానాల పేరుతో ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లను దోపిడీ చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మోటార్ ట్రాన్స్​పోర్ట్ వాహనాల ఐక్య కార్యాచరణ కమిటీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. దాన్ని వ్యతిరేకిస్తూ.. జేఏసీ ఒక్కరోజు బంద్‌కు పిలుపునిచ్చిందని ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్‌ యూనియన్ జేఏసీ నేతలు వెల్లడించారు.

1
1
author img

By

Published : May 18, 2022, 10:22 PM IST

Updated : May 19, 2022, 8:35 AM IST

ఇవాళ అర్ధరాత్రి నుంచి ఆటోలు, క్యాబ్​ల బంద్

Auto-Cabs Bundh: తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఒక్కరోజు బంద్​కు పిలుపునిచ్చారు. గిరాకీలు అంతంతమాత్రంగానే ఉంటున్నాయంటే... ఫిట్‌నెస్‌ లేట్ ఫీజు పేరుతో వాహనదారులపై రోజుకు రూ. 50 వసూలు చేయడంపై ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్‌ యూనియన్ జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్‌ ధరలతోనే అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని.. వాటికి అదనంగా తమపై ఫిట్​నెస్ భారం మోపుతున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్టీఏ కార్యాలయం ముందు నిరసన: గురువారం ఖైరతాబాద్‌ చౌరస్తా నుంచి రవాణాశాఖ కార్యాలయం వరకు డ్రైవర్ల యూనియన్‌ జేఏసీ ర్యాలీగా వెళ్లి తమ నిరసన తెలియజేస్తామని జేఏసీ నేతలు పేర్కొన్నారు. అనంతరం ఖైరతాబాద్ రవాణాశాఖ కార్యాలయం ముందు ధర్నా చేపడుతామన్నారు. ధర్నాలో ఏఐటీయూసీ, సీఐటీయూ, టీఆర్ఎస్​కేవీ, ఐఎఫ్​టీయూ, ఐఎన్టీయూసీలతో పాటు అన్ని లారీ, క్యాబ్, ఆటో యూనియన్లు పాల్గొంటాయని తెలిపారు. ఫిట్​నెస్ చేయించుకోని వాహనదారులకు రోజుకు రూ.50ల జరిమానా విధిస్తున్నారని జేఏసీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రవాణా శాఖ విధిస్తున్న రూ.50ల పెనాల్టీనీ ఆటో, క్యాబ్, లారీ యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయన్నారు.

కొత్త వాటికి పర్మిట్లు ఇవ్వాలి: హైదరాబాద్ నగరంలో కొత్త ఆటోలకు పర్మిట్లు ఇవ్వాలని, ఆటో, క్యాబ్ మీటర్ రేట్లు పెంచాలని, అంతరాష్ట్ర సరిహద్దుల్లో సింగిల్ పర్మిట్లు ఇవ్వాలని జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ఇప్పటికే వాహనాల లైఫ్ ట్యాక్స్​ను పెంచారని వాపోయారు. గ్రీన్ ట్యాక్స్​ను భారీగా పెంచారని... దీనికి తోడు ఈఎంఐలు పెరిగిపోయాయని ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. రోజుకు రూ.50 జరిమానా విధించడంతో అద్దెకు నడుకుపుకుంటున్న వారిపై అధనపు భారం పడుతుందని వాపోతున్నారు. ఒకవైపు పెరిగిన డీజీల్ ధరలతోనే ఆర్థికంగా చితికిపోతున్నామంటే... ఫిట్​నెస్ లేదని రోజుకు రూ.50 విధించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

అందుబాటులో ఉండవు: చాలామంది డ్రైవర్లు ఇప్పటికే తమ వాహనాలను అమ్ముకుని గ్రామాల బాట పట్టారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నూతన మోటర్‌ వెహికల్ చట్టాన్ని రద్దు చేయాలని.. ఫిట్‌నెస్‌ లేట్‌ ఫీజ్‌ ఛార్జీలను వసూలు చేయొద్దని జేఏసీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఒక్కరోజు ఆటో, క్యాబ్ డ్రైవర్ల బంద్‌ కారణంగా నేటి అర్ధరాత్రి నుంచి హైదరాబాద్​లో క్యాబ్ లు, ఆటోలు, లారీలు అందుబాటులో ఉండవని... దూర ప్రయాణాలు, వ్యక్తిగత పనులపై బయటకు వెళ్లే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని జేఏసీ నేతలు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

కేంద్ర ప్రభుత్వం 2019లో రోడ్​ సేఫ్టీ బిల్ తీసుకువచ్చింది. ఆరోజు నుంచే మేం ఆ బిల్లును వ్యతిరేకిస్తూ వచ్చాం. ఈ బిల్లుపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందిస్తూ... ప్రజలకు అనుకూలం లేని చట్టాలను రాష్ట్రంలో అమలు చేయమని చెప్పారు. అయినా కూడా ఏప్రిల్ 1 నుంచి మొండిగా వ్యవహరిస్తున్నారు. ఈ బిల్లును రాష్ట్రంలో అమలు చేయడం వల్ల ఆటో, క్యాబ్, లారీ కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మా సమస్యల పరిష్కారం కోసం 24 గంటల బంద్​కు పిలుపునిస్తున్నాం. ఈ బంద్​లో అన్ని యూనియన్లు పాల్గొంటాయి. బంద్​కు పర్మిషన్ ఇవ్వకపోయినా... బంద్​లో పాల్గొంటాం. ఆర్టీఏ కార్యాలయాలను ముట్టడించి తీరుతాం. -- ఆటో, క్యాబ్, లారీ డ్రైవర్స్‌ యూనియన్ జేఏసీ నేతలు

ఆర్టీసీ ఏర్పాట్లు: అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌లు ప్రయాణికులను చేరవేసే ఇతర ప్రైవేటు వాహనాలు బందులో పాల్గొంటున్న సందర్భంగా ఆర్టీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. అర్ధరాత్రి నుంచి ప్రయాణికుల రద్దీకనుగుణంగా ప్రత్యేక బస్సులను నడుతున్నట్లు గ్రేటర్ ఈడీ యాదగిరి తెలిపారు. ప్రయాణికులు ఆర్టీసీ కల్పిస్తున్న సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. మరిన్ని వివరాలకు 9959226160, 9959226154 నెంబర్లను సంప్రదించాలని కోరారు.

ఇవీ చదవండి:

Last Updated : May 19, 2022, 8:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.