ETV Bharat / city

నేడు తెలంగాణలో బయో ఏసియా 17వ ఎడిషన్ సదస్సు

హైదరాబాద్ హెచ్​ఐసీసీలో బయో ఏసియా 17వ ఎడిషన్ సదస్సు ఇవాళ ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఈ సదస్సుకు ఆ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. మూడు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగంలోని పరిశోధకులు, తయారీదారులు, పెట్టుబడిదారులు, రాజకీయ ప్రముఖులు అందరినీ ఒక్కతాటిపైకి తీసుకురావటం ఈ సదస్సు ఉద్దేశం.

todays-bioasia-17th-edition-seminar-begins
నేడు తెలంగాణలో బయో ఏసియా 17వ ఎడిషన్ సదస్సు
author img

By

Published : Feb 17, 2020, 7:13 AM IST

నేడు తెలంగాణలో బయో ఏసియా 17వ ఎడిషన్ సదస్సు

ప్రతి సంవత్సరం జరిగే బయో ఏసియా సదస్సుకి తెలంగాణ మరోసారి ఆతిథ్యమివ్వనుంది. 17వ బయో ఏసియా సదస్సు హైదరాబాద్​లోని హెచ్ఐసీసీలో జరగనుంది. "టుడే ఫర్ టుమారో” అనే నినాదంతో ఈ సదస్సు నేడు ప్రారంభమై.. మూడు రోజుల పాటు కొనసాగనుంది. ప్రపంచంలోని లైఫ్ సైన్సెస్ కంపెనీలు రేపటి తరాల కోసం తమ ప్రస్తుత సామర్థ్యాన్ని పెంచుకొని, పెట్టుబడులు పెట్టి, అవసరమైన చర్యలను విధానాలను రూపకల్పన చేసేందుకు ఈ సమావేశాల్లో చర్చించనున్నారు.

పెట్టుబడులకు అద్భుతమైన అవకాశం

హైదరాబాద్ నగరానికి ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్ కంపెనీలు రావడంలో బయో ఏసియా కీలకపాత్ర వహిస్తూ వస్తుందని తెలంగాణ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రపంచ స్థాయి పరిశ్రమల మౌలిక వసతుల ప్రమాణాలను, ఇక్కడి పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు బయో ఏసియా ఒక చక్కని అవకాశమని ఆయన పేర్కొన్నారు. ఇక్కడి బయో లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టం గురించి నేరుగా తెలుసుకోవడానికి ఈ సదస్సు ఒక అద్భుతమైన అవకాశాన్ని కల్పిస్తుందని కేటీఆర్ అన్నారు.

నూతన ఆవిష్కరణలు, సవాళ్లు

ఈ సమావేశాల్లో ప్రధానంగా భారతదేశం లైఫ్ సైన్సెస్ ఫార్మా పరిశ్రమ, మెడికల్ డివైసెస్ అండ్ డిజిటల్ హెల్త్ పై సెమినార్ లు జరగనున్నాయి. ప్రపంచ ఆరోగ్య రంగంలో వస్తున్న అంటువ్యాదులను మరింత సమర్ధంగా ఎలా ఎదుర్కోవాలి, నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్య రంగంలోని సవాళ్లుకు చవకైన పరిష్కారాలను కనుగొనడం వంటి పలు కీలకమైన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు.

హాజరుకానున్న ప్రతినిధులు

  • ప్రపంచ వ్యాప్తంగా 37 దేశాల నుంచి సుమారు 2000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. 800 కంపెనీల ప్రతినిధులు, 75 స్టార్టప్ కంపెనీలు ఈ సమావేశాల్లో భాగస్వాములు కానున్నాయి. ఈ సంవత్సరం స్విట్జర్లాండ్ భాగస్వామ్య దేశంగా.. అస్సాం, కేరళ, ఒరిస్సా, గుజరాత్ రాష్ట్రాలు భాగస్వామి రాష్ట్రాలు ఉన్నాయి.

బయో ఏసియా - లక్ష్యాలు

  1. గత దశాబ్ద కాలంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఉన్న అవకాశాల పరిశీలన, ఇక్కడ పెట్టుబడుల కోసం ప్రపంచ స్థాయి లైఫ్ సైన్సెస్, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాన నిర్ణేతలు, ఆవిష్కకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడంలో బయో ఏసియా కీలకపాత్ర వహిస్తూ వస్తున్నది.
  2. గత 17 సంవత్సరాలుగా వందలకొద్ది ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి స్థానిక కంపెనీలకు గ్లోబల్ ఇన్వెస్టర్లను బయో ఆసియా సదస్సు పరిచయం చేసింది.
  3. ఈ సంవత్సరం కూడా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సుకు హాజరవుతున్నట్లు సదస్సు పేర్కొంది. కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తో పాటు ప్రపంచ స్థాయి కంపెనీల సీఈవోలు, సీనియర్ ప్రతినిధులు, పరిశోధకులు మూడు రోజులపాటు జరిగే వివిధ సమావేశాల్లో పాల్గొననున్నారు.

ఇవీ చూడండి:

సీఏఏను రద్దు చేయాలని మంత్రివర్గ తీర్మానం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.