విపత్తుల కారణంగా పంట నష్టపోయిన రైతులకు.... వైఎస్సార్ ఉచిత పంటల బీమా కింద పరిహారాన్ని ప్రభుత్వం ఇవాళ అందించనుంది. 9 లక్షల 48 వేల మంది రైతులకు సుమారు 12 వందల 52 కోట్ల రూపాయల బీమా చెల్లించనుంది. 2019 సీజన్‌లో పంట నష్టపోయిన రైతులకు ఈ పరిహారం అందనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి జగన్ ప్రారంభించనున్నారు.
రైతుల బ్యాంకు ఖాతాల్లోకి ఈ మొత్తాన్ని నేరుగా జమచేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది. రైతులపై ఎలాంటి భారం లేకుండా పూర్తి ఖర్చు ప్రభుత్వమే భరిస్తోంది. భూమి సాగు చేస్తూ.... ఈ-క్రాప్‌లో రైతులు నమోదు చేసుకున్న ప్రతి ఎకరాన్నీ బీమా పరిధిలో చేర్చి... ప్రభుత్వమే బీమా ప్రీమియమ్ చెల్లించనుంది.
ఇదీ చదవండి: