ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో విచారణ

author img

By

Published : Jan 18, 2021, 5:25 AM IST

పంచాయతీ ఎన్నికలపై నేడు హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. ఎస్ఈసీ జారీ చేసిన ప్రోసిడింగ్స్‌పై హైకోర్టు సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులపై ఎన్నికల సంఘం...హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించింది. ఎస్ఈసీ దాఖలు చేసిన అప్పీల్‌పై నేడు హైకోర్టు డివిజన్ బెంచ్‌ విచారణ జరపనుంది.

Today Panchayat election hearing in High Court
పంచాయతీ ఎన్నికల నిర్వహణపై నేడు హైకోర్టులో విచారణ

సంక్రాంతి సెలవుల అనంతరం నేడు పునఃప్రారంభం కానున్న హైకోర్టులో పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన కీలక విచారణ జరగనుంది. సింగిల్‌ జడ్జి మధ్యంతర ఉత్తర్వులపై హైకోర్టును ఎస్ఈసీ ఆశ్రయించగా...ఆ పిటిషన్‌పై నేడు ధర్మాసనం విచారణ జరపనుంది. సింగిల్ జడ్జి ఉత్తర్వులు ఈనెల 18 వరకు అమల్లో ఉంటే అభ్యర్థులు, ఓటర్ల ఆలోచనల్లో గందరగోళం తలెత్తుందని...గత విచారణ సందర్భంగా ఎస్ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ను అమలును నిలుపుదల చేయడం వల్ల .. ఓటర్ల జాబితా తయారీ ప్రక్రియ నిలిచిపోతుందని తెలిపారు. ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడం వల్ల ఎన్నికల సన్నద్ధత మరింత కష్టంగా మారుతుందని వివరించారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఎన్నికల ప్రక్రియ చేపట్టినట్లు ఎస్ఈసీ తరపు న్యాయవాది అశ్వనీకుమార్ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం తరపున వాదనలు వినిపించిన అడ్వకేట్ జనరల్‌....విచారణ వాయిదా వేయడం వల్ల ఎన్నికల నిర్వహణకు ఇబ్బందులేమీ ఉండవన్నారు. గతేడాది మార్చిలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఎస్ఈసీ విడుదల చేసిందని....అప్పటి ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా సైతం ప్రచురితమైందన్నారు. ఈనెల 22 కల్లా ఓటర్ల జాబితాను ఎస్‌ఈసీ ముందుంచే బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. సింగిల్‌ జడ్జి ఉత్తర్వులతో ఓటర్ల జాబితా ప్రచుణకు ఎలాంటి ఇబ్బంది తలెత్తదన్నారు. ఇరువురి వాదనలు పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం విచారణను నేటికి వాయిదా వేసింది. ఓటర్లను ప్రభావితం చేసేలా కొత్త పథకాలు , అభివృద్ధి కార్యక్రమాలు చేపడితే ఈ విషయాన్ని నేడు జరిగే విచారణలో కోర్టు దృష్టికి తీసుకురావాల్సిందిగా ఎస్ఈసీకి సూచించింది.

ఇదీ చదవండి:

ఎస్వీబీసీ ట్రస్టుకు కోటి రూపాయల విరాళం

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.