తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. నిన్న రాత్రి 8 గంటల వరకూ కొత్తగా 2,083 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ తాజా బులెటిన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 64,786కి చేరింది. మరో 11 మంది మృతి చెందడంతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 530కి పెరిగింది.
కొవిడ్ నుంచి కొలుకుని తాజాగా 1114 మంది డిశ్చార్జి అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 46,502 మంది కోలుకోగా.. 17,754 మంది చికిత్స పొందుతున్నారు. వీరిలో 11,359 మంది హోమ్/ఇనిస్టిట్యూషనల్ ఐసోలేషన్లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ఇదీచదవండి