సీఎం జగన్ దేశ రాజధాని దిల్లీ చేరుకున్నారు. కాసేపట్లో జన్‌పథ్ -1కు చేరుకుంటారు. రాష్ట్రానికి సంబంధించిన వివిధ అంశాలపై కేంద్ర మంత్రులతో చర్చలు జరపనున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసేందుకు జగన్ ఇంతకుముందే సమయం కోరారు. కేంద్ర జలవనురలు శాఖ మంత్రి గజేంద్రసింగ్ తో భేటీ అయ్యే అవకాశం ఉంది. పోలవరం రివర్స్ టెండరింగ్, పనుల నిలుపుదల వంటి అంశాలు ప్రధానంగా చర్చకు రానున్నాయి. కేంద్రం నుంచి రావాల్సిన నిధులపైనా చర్చించే అవకాశం ఉంది.
కేంద్ర విద్యుత్ శాఖమంత్రి రాజ్‌కుమార్ సింగ్‌తో సీఎం భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల వివాదాలపై సీఎం వివరణ ఇవ్వడమే కాక.. పీపీఏలు రద్దు చేయరాదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రమంత్రి ఆర్.కె. సింగ్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ లేఖకు జవాబునిస్తూ రాష్ట్ర మంత్రి ప్రత్యుత్తరం పంపింది. నాటి నుంచి నేటి వరకు కేంద్రం స్పందించలేదు. ఈ అంశంపైనా సీఎం పర్యటనలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.