సీఎం జగన్ ఇవాళ గుంటూరు, విజయవాడలో పర్యటించనున్నారు. గుంటూరు నగరంలో కొవిడ్ వ్యాక్సిన్ వేయించుకోనున్నారు.ఉదయం 11.10 గంటల నుంచి 11.55 గంటల వరకు గుంటూరు భారత్‌పేట 6వ లైన్ వార్డు సచివాలయంలో సీఎం ఉండనున్నారు. కొవిడ్ వ్యాక్సినేషన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ అనంతరం వ్యాక్సినేషన్ చేయించుకుంటారు. అబ్జర్వేషన్‌లో ఉండడంతో పాటు సచివాలయం, వైద్య సిబ్బందితో సమావేశమవుతారు. అనంతరం తాడేపల్లిలోని నివాసానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.25 గంటలకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోనున్నారు. మేయర్లు, డిప్యూటీ మేయర్లు, పురపాలక ఛైర్మన్‌లు, వైస్ ఛైర్మన్‌ల కార్యశాలలో సీఎం పాల్గొననున్నారు.
ఇదీ చదవండి
తిరుపతి ఉపఎన్నిక: 30 నామినేషన్లు ఖరారు