వాయవ్య బంగాళాఖాతం, దాన్ని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడింది. బుధవారం నాటికి ఇది బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం సంచాలకులు స్టెల్లా తెలిపారు. ‘అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో.. బుధ, గురువారాల్లో కోస్తా, రాయలసీమలో చాలాచోట్ల ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు కురిసే అవకాశం ఉంది’ అని చెప్పారు.
ఇదీ చూడండి: RAINS: తగ్గని వరద ఉద్ధృతి..గులాబ్ ధాటికి అన్నదాతకు కష్టాలు