ETV Bharat / city

'ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన వారిపై చర్యలు తీసుకోవాలి'

నిరుద్యోగ యువతను మోసం చేసి కోట్ల రూపాయలు ఆర్జించిన వైెఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్​పై చర్యలు తీసుకోవాలని టీఎస్టీయూసీ సభ్యులు డిమాండ్ చేశారు. ఏపీఎస్​ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన ఆ ఫెడరేషన్ గుర్తింపును రద్దు చేయాలంటూ... సంస్థ ఎండీకి వినతి పత్రం అందజేశారు.

tntuc comments on ysr employee federation
వైెఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్​పై చర్యలు తీసుకోవాలని టీఎస్టీయూసీ సభ్యులు వినతి పత్రం
author img

By

Published : Jun 16, 2020, 6:23 PM IST

నిరుద్యోగ యువతకు అన్యాయం చేసి కోట్ల రూపాయలు దండుకొని ఏపీఎస్​ఆర్టీసీ ప్రతిష్ఠను దిగజార్చిన.. వైఎస్సార్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు రవి కుమార్​పై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని టీఎస్టీయూసీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ప్రతాప్​, తెలుగునాడు ట్రేడ్ యూనియన్ అధికారులకు టీఎన్టీయూసీ అధ్యక్షుడు రఘురామరాజు వినతి పత్రం అందజేశారు. ఆ ఫెడరేషన్ గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో దోషులు అందరినీ శిక్షించాలన్నారు. ఈ కేసును అవినీతి నిరోధక శాఖకు రిఫర్ చేసి ఆర్టీసీ గౌరవాన్ని కాపాడాలని టీఎస్టీయూసీ సభ్యులు కోరారు.

ఇదీ చూడండి:మూడు రాజధానుల బిల్లు మళ్లీ సభ ముందుకు అవసరమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.