ETV Bharat / city

తెలంగాణ: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడి మృతి - మెదక్​ జిల్లాలో బోరు బావిలో పడిన మూడేళ్ల బాలుడు

తెలంగాణలోని మెదక్ జిల్లాలో పొలంలో ఆడుకుంటూ పొరపాటున బోరుబావిలో పడిన మూడేళ్ల చిన్నారి సాయివర్ధన్​ మృతి చెందాడు. బాలుడిని కాపాడేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది.

తెలంగాణ: బోరుబావిలో పడిన మూడేళ్ల బాలుడి మృతి

author img

By

Published : May 27, 2020, 10:08 PM IST

Updated : May 28, 2020, 6:54 AM IST

తెలంగాణలోని మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లిలో బోరుబావిలో పడిన చిన్నారి కథ విషాదాంతమైంది. మూడేళ్ల బాలుడు సాయివర్ధన్​ ప్రాణాలు కోల్పోయాడు. 17 అడుగుల లోతు నుంచి బాలుడి మృతదేహాన్ని అధికారులు వెలికితీశారు. 11.30 గంటల పాటు బోరుగుంతలో ఉండడం వల్ల ఆక్సిజన్​ అందక చిన్నారి మృతి చెందినట్లు ప్రాథమికంగా గుర్తించారు.

ఫలించని అధికారుల శ్రమ

బుధవారం సాయంత్రం 5.45 గంటలకు బాలుడు సాయివర్ధన్​ పొలంలో ఆడుకుంటూ బోరుబావిలో పడిపోయాడు. విషయం తెలుసుకున్న ఎన్డీఆర్​ఎఫ్​ బృందాలు వెంటనే సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆక్సిజన్‌ పైపులోనికి పంపి బాలుడిని క్షేమంగా బయటకు తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు చేసినప్పటికీ... అవేమీ ఫలించలేదు. బోరుబావికి సమాంతరంగా గొయ్యి తవ్వి దాదాపు 8.30 గంటలపాటు శ్రమించి బాలుణ్ని వెలికితీశాయి. అప్పటికే బాలుడు ప్రాణాలు కోల్పోయాడు. బాలుడి మృతదేహాన్ని మెదక్​ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.

కేసింగ్​ వేయకపోవడం వల్లే

మంగళి భిక్షపతి అనే వ్యక్తి తన పొలంలో బోరు వేయించగా.. నీళ్లు రాకపోవడం వల్ల దాన్ని అలాగే వదిలేశాడు. బోరు వేసిన తర్వాత బాలుడి తల్లిదండ్రులు పనిలో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. బోరు వేసిన చోట కేసింగ్‌ వేయకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగింది.

రిగ్గు యజమానిపై చర్యలు..

ఘటన స్థలంలో బాలుడి తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, జిల్లా కలెక్టర్​ ధర్మారెడ్డి, ఎస్పీ చందనాదీప్తి, ఆర్డీవో సాయిరాం సహాయక చర్యలు పూర్తయ్యే వరకు సంఘటన స్థలంలోనే ఉండి పర్యవేక్షించారు. బోర్లు విఫలమైతే వెంటనే పూడ్చివేయాలని రైతులకు ఎమ్మెల్యే సూచించారు. అనుమతి లేకుండా బోర్లు వేసిన రిగ్గు యజమానిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ వెల్లడించారు.

ఇదీ చూడండి..

మహానేతకు మహానాడు వేదికగా ఘన నివాళి

Last Updated : May 28, 2020, 6:54 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.