ETV Bharat / city

సెల్లార్ గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి - Three persons are died in hyd

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా దారుణం జరిగింది. భవన నిర్మాణానికి గుంత తీస్తుండగా గోడ కూలి ఇద్దరు మృతి చెందారు. నార్సింగి పరిధిలోని పుప్పాల్​గూడలో ఈ ఘటన చోటు చేసుకుంది.

ముగ్గురు మృతి
ముగ్గురు మృతి
author img

By

Published : Jun 25, 2022, 6:55 PM IST

Updated : Jun 25, 2022, 8:26 PM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్ పరిధిలోని పుప్పాలగూడలో సెల్లార్‌ గుంతలో పని చేస్తున్న కార్మికులపై మట్టి పెల్లలు పడటంతో ఇద్దరు మృతిచెందారు. సెల్లార్ కోసం శ్లాబ్ వేసేందుకు రాడ్ పనులు చేస్తుండగా పైనుంచి ఒక్కసారిగా మట్టికుప్ప వారిపై పడింది. ప్రమాద సమయంలో 13 మంది కార్మికులు పని చేస్తున్నారు. మట్టి కింద పడగానే 11 మంది తప్పించుకోగా... ఇద్దరు మాత్రం మట్టి కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారు శ్రీకాకుళం వాసులుగా గుర్తించారు. నిర్మాణ సమయంలో కనీస జాగ్రత్తలు పాటించని నిర్మాణ సంస్థపై పోలీసులు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చూడండి:

Last Updated : Jun 25, 2022, 8:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.