ఒకే ఇంట్లో మూడు రోజుల వ్యవధిలో ముగ్గురు మృత్యువాత పడిన హృదయ విదారక ఘటన తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలంలోని చేపూర్లో చోటు చేసుకుంది. మల్కన్న(66) అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతిచెందారు. దీంతో ఇద్దరు కుమారులు, కుమార్తెలు, కోడళ్లు, అల్లుళ్లు అంత్యక్రియలకు వచ్చారు. ఇతర కార్యక్రమాల కోసం అక్కడే ఉన్నారు.
ఆదివారం ఉదయం చిన్న కుమార్తె భర్త లక్ష్మణ్(45) గుండెపోటుతో మరణించారు. ఆయన మృతదేహాన్ని నిర్మల్ జిల్లాలోని సొంత గ్రామానికి తీసుకెళ్లి అంత్యక్రియలు పూర్తి చేశారు. ఈ విషయం మల్కన్న భార్య మల్కవ్వ(60)కు తెలియకుండా జాగ్రత్తపడ్డారు. చివరకు అల్లుడి మరణవార్త తెలియడంతో ఆమె మనస్తాపంతో ఒక్కసారిగా కుప్పకూలింది. వృద్దురాలు కొవిడ్‌తో మృతి చెంది ఉంటుందని గ్రామస్థులు ఎవరూ అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. కుటుంబ సభ్యులే అంత్యక్రియలు పూర్తిచేశారు.
ఇవీ చూడండి :
ఉపరితల ద్రోణితో.. రెండు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు వర్షాలు