ఆర్థికశాఖలో ముగ్గురు ఉద్యోగులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఇద్దరు సెక్షన్ అధికారులు, సహాయ కార్యదర్శిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఆర్థిక శాఖలో సెక్షన్ అధికారులుగా పని చేస్తున్న డి. శ్రీనిబాబు, కె. వరప్రసాద్‌తో పాటు అసిస్టెంట్ సెక్రటరీ నాగులపాటి వెంకటేశ్వర్లును సస్పెండ్ చేస్తూ ఈ ఆదేశాలు ఇచ్చారు. ఈ ముగ్గురూ ఆర్ధిక శాఖలోని సమాచారం లీక్ చేస్తున్నారన్న అభియోగంపై సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకించి ఆర్ధిక శాఖలో గోప్యంగా ఉండాల్సిన సమాచారం మీడియాకు లీక్ ఇస్తున్నారన్న అభియోగాలపై వీరిపై సస్పెన్షన్ వేటు వేస్తూ ఆదేశాలు ఇచ్చారు.
ఈ ముగ్గురిపై క్రమశిక్షణా చర్యలు కూడా తీసుకోనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కోంది. ఆర్ధిక శాఖకు సంబంధించి మీడియాలో వరుస కథనాలు వస్తుండటం వల్ల ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలుగుతోందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వ అనుమతి లేకుండా హెడ్ క్యార్టర్ విడిచి వెళ్లరాదని ముగ్గురిని ప్రభుత్వం ఆదేశించింది.
ఇదీ చూడండి. vishaka steel: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 100 శాతం వాటాల ఉపసంహరణ చర్యలు వేగవంతం