ETV Bharat / city

3, 4, 5 తరగతుల విలీన ప్రక్రియ ప్రారంభం - ఏపీలో పాఠశాలల విలీనం

రాష్ట్రంలో 250 మీటర్ల పరిధిలో ఉన్న 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాల్లో విలీనం చేసే ప్రక్రియ మొదలైంది. పాఠశాలలను కలిపినప్పటికీ... ఉన్నత పాఠశాల్లో తరగతి గదుల కొరత కారణంగా ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాల భవనంలోనే వీటిని కొనసాగించాలని నిర్ణయించారు.

third-to-fifth-classes-merging-in-high-schools
ప్రారంభమైన 3,4,5 తరగతుల విలీన ప్రక్రియ
author img

By

Published : Nov 2, 2021, 8:36 AM IST

రాష్ట్రంలో 250 మీటర్ల పరిధిలోని 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలిపే ప్రక్రియ ప్రారంభమైంది. అక్టోబరు 30వరకు మ్యాపింగ్‌ పూర్తి చేసి, నవంబరు ఒకటి నుంచి 3, 4, 5 తరగతులను ఉన్నత పాఠశాలకు అనుసంధానించాలని గత ఆదేశాల్లో పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా 3,178 ఉన్నత పాఠశాలలకు 250 మీటర్ల దూరంలో 3,627 ప్రాథమిక బడులు ఉన్నాయి. అయితే పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఆదేశాలల్లో స్పష్టత లేకపోవడంతో సోమవారం ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి అధికారులతో వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

కొన్ని అంశాలపై సందిగ్ధత ఉండడంతో చాలా చోట్ల ఈ ప్రక్రియ పూర్తి కాలేదు. ఉన్నత పాఠశాలల్లో తరగతి గదుల కొరత కారణంగా 3, 4, 5 తరగతులను కలిపేసినా ప్రస్తుతానికి ప్రాథమిక పాఠశాల భవనంలోనే వీటిని కొనసాగించాలని నిర్ణయించారు.

ఇదీ చూడండి:

బద్వేలు ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రారంభం.. మధ్యాహ్నానికి రిజల్ట్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.