ETV Bharat / city

చోరీ చేసిన ఇంటిని తగలబెట్టిన దొంగలు, ఎందుకంటే - ఇంటికి నిప్పు పెట్టిన దొంగలు

Thieves set the house on fire సికింద్రాబాద్‌లోని ఓల్డ్‌ అల్వాల్‌లోని ప్రెసిడెన్సీ కాలనీలో దొంగలు బీభత్సం సృష్టించారు. తండ్రి సంవత్సరీకం కోసం దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్లిన బంగారు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడి, నగదును అపహరించారు. అనంతరం ఇంట్లో కారంపొడి జల్లి, నిప్పంటించి ఆధారాలు లేకుండా చేసే ప్రయత్నం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Thieves set the house on fire
ఇంటిని తగలబెట్టిన దొంగలు
author img

By

Published : Aug 27, 2022, 8:42 PM IST

Thieves set the house on fire తండ్రి సంవత్సరికం కోసం దిల్​సుఖ్​నగర్​కు వెళ్లిన బంగారు రెడ్డి అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీ చేసి నిప్పంటించారు. ఈ సంఘటన పేట్ బషీర్​బాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.పేట్ బషీర్​బాద్​ పీఎస్ పరిధిలోని పంచశీల కాలనీలో ఇవాళ తెల్లవారుజామున దొంగలు బీభత్సం సృష్టించారు. అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు చోరీ చేసి ఇంట్లో ఉన్న 80 వేల నగదును అపహరించారు. ఆనవాళ్లు ఏవీ దొరకకుండా ఇంట్లో కారంపొడి చల్లి నిప్పంటించారు.

ఘటన స్థలానికి చేరుకున్నపేట్ బషీర్​బాద్​ పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం క్లూస్​టీమ్​ని పిలిపించారు. ఓల్డ్ అల్వాల్​లోని ప్రెసిడెన్సి కాలనీలో నివాసం ఉంటున్న బంగారు రెడ్డి ఇంటికి చేరుకున్న క్లూస్ టీమ్ ఆధారాలను సేకరిస్తున్నాయి. ఇంట్లో దొంగతనానికి సంబంధించి అన్ని కోణాల్లో పోలీసులు పరిశీలిస్తున్నారు. ఇంట్లోకి చొరబడ్డ దుండగులు ఇంటికి నిప్పు పెట్టిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇంటికి నిప్పంటించడంతో రెండో అంతస్తులో ఉన్న సామగ్రి మెుత్తం పూర్తిగా కాలి బూడిదైంది. కేసు నమోదు చేసుకొని, అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.