ETV Bharat / city

వినియోగదారులకు స్వల్ప ఊరట...తప్పిన విద్యుత్ ఛార్జీల భారం - Electricity Regulatory Board news

2021 ఏప్రిల్‌ నుంచి అమల్లోకి రానున్న విద్యుత్‌ ఛార్జీల ప్రతిపాదనలను.... రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు ఏపీఈఆర్​సీకి అందించాయి. కొత్త ప్రతిపాదనల ప్రకారం... వచ్చే ఆర్థిక సంవత్సరంలో 11 వేల 911 కోట్ల నష్టాలు వస్తాయని నివేదించాయి. వినియోగంలో గేటెడ్‌ కమ్యూనిటీ వినియోగదారులకు స్వల్ప ఊరట లభించనుంది. ఎల్‌టీ గృహ విద్యుత్‌ వినియోగదారులకు స్థిరఛార్జీల భారం తప్పనుంది.

There is no change in electricity charges in AP
విద్యుత్ ఛార్జీల్లో మార్పు లేదు
author img

By

Published : Dec 1, 2020, 8:16 AM IST

వినియోగదారులపై విద్యుత్‌ ఛార్జీల భారం పడకుండా విద్యుత్‌ పంపిణీ సంస్థలు వార్షిక సగటు ఆదాయ అవసరాల (ఏఆర్‌ఆర్‌) నివేదికను విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి దాఖలు చేశాయి. ప్రస్తుతం వసూలుచేస్తున్న ఛార్జీల్లో ఎలాంటి మార్పులనూ ప్రతిపాదించలేదు. కొత్త కేటగిరీలను ఏర్పాటు చేయలేదు. మూడు విద్యుత్‌ పంపిణీ సంస్థలకు కలిపి వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.11,911 కోట్ల నష్టాలు వస్తాయని పేర్కొన్నాయి. ఏపీ విద్యుత్‌ పంపిణీ సంస్థలైన ఏపీఎస్‌పీడీసీఎల్‌, ఈపీడీసీఎల్‌, సీపీడీసీఎల్‌లు సోమవారం వర్చువల్‌ విధానంలో ఏఆర్‌ఆర్‌ను ఏపీఈఆర్‌సీకి అందించాయి. 2021 ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి వచ్చే విద్యుత్‌ ఛార్జీల ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. నవంబరు నెలాఖరులోగా దాఖలు చేయాలన్న ఏపీఈఆర్‌సీ ఆదేశాల మేరకు సోమవారంతో గడువు ముగియనుండటంతో ఆన్‌లైన్లోనే ప్రతిపాదనలను పంపాయి.

* వచ్చే ఆర్థిక సంవత్సరంలో (2021-22) 68,369 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ కొనుగోలుకు రూ.30,206 కోట్ల ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నాయి. దీని ప్రకారం ఒక్కో యూనిట్‌కు రూ.4.42 వంతున డిస్కంలు వెచ్చించాలి. దీనికి నెట్‌వర్కు, ఇతర ఖర్చుల కింద రూ.13,824 కోట్లు అవసరం. దీని ప్రకారం ఏడాదిలో విద్యుత్‌ కొనుగోలు, ఇతర ఖర్చులకు రూ.44,030 కోట్లు వెచ్చించాలి. ప్రతిపాదిత విద్యుత్‌ ఛార్జీల ప్రకారం రూ.32,110 కోట్ల ఆదాయం విద్యుత్‌ విక్రయాల ద్వారా వస్తుందని అంచనా. అంటే ఆదాయలోటు రూ.11,911 కోట్లు. ఈ మొత్తాన్ని ప్రభుత్వ సబ్సిడీ రూపేణా, అంతర్గత ఖర్చులను నియంత్రించటం ద్వారా భర్తీ చేసుకోవాలని డిస్కంలు భావిస్తున్నాయి.
* విద్యుత్‌ సరఫరాకు ఒక్కో యూనిట్‌కు డిస్కంలు రూ.7.21 వంతున ఖర్చుచేయాలని అంచనా. ప్రతిపాదిత టారిఫ్‌ ప్రకారం యూనిట్‌ విక్రయాల ద్వారా రూ.5.26 వస్తుంది. మూడు డిస్కంలు కలిపి ఏడాదిలో 61,050 మిలియన్‌ యూనిట్లను విక్రయించే అవకాశం ఉందని అంచనా.

కొద్దిపాటి సవరణలు

వచ్చే ఏడాది నుంచి అమలుచేయనున్న టారిఫ్‌లో డిస్కంలు కొన్ని మార్పులను ప్రతిపాదించాయి. దీని ప్రకారం కొత్త కేటగిరీ ఏర్పాటుచేయకున్నా.. ప్రస్తుతం అమల్లో ఉన్న టారిఫ్‌లో కొన్ని మార్పులను ప్రతిపాదించాయి. అవి..

* ఎల్‌టీ గృహ విద్యుత్‌ వినియోగదారుల నుంచి ప్రస్తుతం వసూలుచేస్తున్న కనీస విద్యుత్‌ ఛార్జీలను ఉపసంహరించి.. దీనికి బదులుగా కిలోవాట్‌కు రూ.10 వంతున స్థిరఛార్జీలను ప్రతిపాదించాయి.
* కళ్యాణమండపాల నుంచి ప్రస్తుతం కిలో వాట్‌కు రూ.100 వంతున వసూలు చేస్తున్న స్థిరఛార్జీలను ఉపసంహరించారు.
* పౌల్ట్రీ హేచరీలు, పౌల్ట్రీ ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లు, ఆక్వా హేచరీలు, ఆక్వా ఫీడ్‌ మిక్సింగ్‌ ప్లాంట్లను వ్యవసాయ కేటగిరీ ఎల్‌టి-5(సి), హెచ్‌టి-5(సి) నుంచి పారిశ్రామిక కేటగిరీ ఎల్‌టి-3(ఎ), హెచ్‌టి-3(ఎ) పరిధిలోకి మార్చాలని నిర్ణయించారు. ఇలా మార్చడంతో వారిపై భారం తగ్గుతుంది.
* గ్రూప్‌హౌసింగ్‌ సొసైటీలు, అపార్టుమెంటు కాంప్లెక్సులు, భవనాలకు (టౌన్‌షిప్‌లు, కాలనీలు, గేటెడ్‌ కమ్యూనిటీలు, విల్లా, బంగ్లా) హెచ్‌టీ-1 కేటగిరీలో యూనిట్‌కు రూ.5.95 వంతున వసూలు చేయాలని నిర్ణయం. ప్రస్తుతం యూనిట్‌కు రూ.7 వంతున వసూలు చేస్తున్నారు.
* ప్రస్తుతం ఉదయం 6-10 గంటల మధ్య పీక్‌ టీవోడీ (టైమ్‌ ఆఫ్‌ ద డే)గా పరిగణిస్తున్నారు. దీన్ని ఉదయం 4-8 గంటలకు మార్చారు. ఈ సమయంలో వ్యవసాయ విద్యుత్‌ వినియోగం ఉండదు. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 4 గంటల వరకు కొత్త ఆఫ్‌ పీక్‌ వ్యవధిగా ప్రతిపాదించారు.
* ఇండస్ట్రియల్‌-3 కేటగిరీ వినియోగదారులకు ప్రస్తుతం ఇస్తున్న లోడ్‌ ఫ్యాక్టర్‌ ఇన్సెంటివ్‌ ఉపసంహరణ.
* డిస్కంలతో ఎలాంటి విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు లేకుండా క్యాప్టివ్‌ విధానంలో ఏర్పాటుచేసిన విద్యుత్‌ ప్లాంట్లు, ఇండిపెండెంట్‌ పవర్‌ ప్రొడ్యూసర్స్‌ (ఐపీపీ) నుంచి స్టార్టప్‌ కేటగిరీ కింద ఛార్జీల వసూలు. ప్రస్తుతం వీటికి ఇండస్ట్రియల్‌ కేటగిరీ-5(సి) కింద ఛార్జీలు వసూలుచేస్తున్నారు.

ఇదీ చదవండి:

'ప్రభుత్వం మారినప్పుడల్లా విధాన నిర్ణయాల మార్పు తగదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.