బిహార్ దర్భంగ బ్లాస్ట్ కేసులో (Darbhanga blast) ఇద్దరు నిందితులను కాసేపట్లో హైదరాబాద్‌లోని నాంపల్లి ఎన్ఐఏ కోర్టులో హాజరు పరచనున్నారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్‌పై పాట్నా తీసుకెళ్లనున్నారు. మల్లేపల్లి కేంద్రంగా ఉగ్రవాద కార్యకలాపాలు జరిగాయని తెలుసుకున్న స్థానికులు ఉలిక్కిపడ్డారు. అదే ప్రాంతంలో ఓ బట్టల దుకాణం ఎదుట ఉన్న ఫుట్ పాత్‌పై బట్టలు అమ్ముకుంటూ ఉండేవారని, తమ్ముడు నాసిర్ మాలిక్ కొద్దిరోజుల క్రితం వారి సొంత ఊరికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇదంతా జరిగిందని ఇంటి పక్కన ఉండే వారు చెబుతున్నారు.
ఇలా దొరికారు...
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పార్శిల్ కౌంటర్ వద్ద నిందితులు సూపియాన్ అనే పేరుతో ఓ పాన్ కార్డు ప్రతిని సమర్పించారు. పేలుడు తర్వాత దర్భంగా జీఆర్పీ సహకారంతో దర్యాప్తు చేసిన ఎన్ఐఏ పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్‌పై దృష్టి సారించారు. సికింద్రాబాద్ నుంచి దర్భంగాకు తరచుగా వస్తువులు వస్తూనే ఉంటాయి. కాని దుస్తులు రావడం ఇదే మొదటిసారి. పైగా అసలు ఇక్కడ నుంచి దుస్తులు పంపాల్సిన అవసరం ఏముందనే దానిపై దృష్టి సారించారు. వ్యక్తిగత అవసరాల నిమిత్తం పంపి ఉంటే ఒకటి రెండు పంపుతారు. కాని అన్ని కిలోల దుస్తులు ఎందుకు పంపుతారు అనే అనుమానంతో పార్శిల్ కౌంటర్ వద్ద ఇచ్చిన ఫోన్ నంబర్‌ను ట్రాక్ చేయగా ఆ నంబరు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం శామి జిల్లా జైరానాకు చెందిన వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. టవర్ లొకేషన్లో హైదరాబాద్ ఆపరేట్ అవుతున్నట్లు తేల్చారు. పార్శిల్ పంపిన బట్టల దుకాణంలో ఆరా తీశారు. పక్క సమాచారంతో నాంపల్లికి చెందిన ఇమ్రాన్ మాలిక్, మహ్మద్ నజీర్ ఖాన్‌ను అరెస్టు చేశారు. వీరు ఉత్తర ప్రదేశ్ నుంచి వచ్చి హైదరాబాద్‌లో ఉంటున్నట్లు గుర్తించారు.
నాసిర్, ఇమ్రాన్‌లను కాసేపట్లో నాంపల్లి కోర్టులో హాజరు పరిచి పట్నాకు తరలించనున్నారు. నిందితులిద్దరినీ లోతుగా ప్రశ్నించి భారీ కుట్రకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు.
ఇదీ చదవండి: