విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్యకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టులో జరుగుతున్న విచారణపై స్టే ఇవ్వాలంటూ జస్టిస్ ఈశ్వరయ్య పిటిషన్ వేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇచ్చేంచేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. జడ్జి రామకృష్ణతో మాట్లాడిన మాట నిజమని.. జస్టిస్ ఈశ్వరయ్య న్యాయవాది అంగీకరించారు.
ఫోన్ సంభాషణపై అఫిడవిట్ దాఖలుకు ధర్మాసనం ఆదేశించింది. ఇద్దరి ప్రైవేటు సంభాషణలపై విచారణ అవసరంలేదని ప్రశాంత్ భూషణ్ వాదించారు. జస్టిస్ ఈశ్వరయ్య వ్యాఖ్యలు న్యాయవ్యవస్థపై దాడిగా పరిగణించాలని కపిల్ సిబల్ వాదన వినిపించారు. కేసు విచారణను జస్టిస్ అశోక్ భూషణ్ ధర్మాసనం.. సోమవారానికి వాయిదా వేసింది.
ఇదీ చదవండి: అమ్మఒడి రెండో విడత చెల్లింపులు ప్రారంభం