కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తొలి 40 రోజుల్లోనే సెక్యూరిటీల వేలం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం రూ.7,000 కోట్ల రుణం సమీకరించింది. ప్రస్తుత కరోనా కాలంలో సొంత ఆదాయం లేకపోవడంతో రుణాలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ఏప్రిల్‌లో రూ.5,000 కోట్లు సమీకరించగా, ప్రస్తుతం మరో రూ.2,000 కోట్లు రుణంగా తీసుకుంది. రిజర్వు బ్యాంకు మంగళవారం నిర్వహించిన వేలంలో అయిదేళ్ల కాలానికి 5.89 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు, ఏడేళ్ల కాలపరిమితికి 6.35 శాతం వడ్డీకి మరో రూ.1000 కోట్లు రుణం స్వీకరించింది.
ఇవీ చదవండి...గొడుగు, మాస్కు ఉంటేనే మద్యం: కలెక్టర్ నివాస్