కరోనా సమయంలో చాలా సంస్థలు ఉద్యోగులకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. కొద్దిపాటి సడలింపులు కూడా ఇస్తున్నాయి. ఇక మీ విషయానికి వస్తే... వీడియో ఇంటర్వ్యూ చేయమని అభ్యర్థించండి. అకౌంట్స్ విభాగంలో పనిచేయబోతున్నారు కాబట్టి ఆయా అంశాలకు సంబంధించిన మీ విషయ పరిజ్ఞానాన్ని అంచనావేస్తే సరిపోతుంది. ‘ప్రస్తుత పరిస్థితుల్లో ఫోన్ లేదా వీడియోలో ఇంటర్వ్యూ చేస్తే మీకెంతో సాయంచేసినట్లు అవుతుందని వివరించండి. పరిస్థితులు కాస్త అనుకూలించాక వ్యక్తిగతంగా కలుస్తాను’ అని ఫోన్‌లో అభ్యర్థించండి.
- ఇంటర్వ్యూకు మీరు మాస్క్ పెట్టుకుని వెళ్లడమే మంచిది. మీరు మీ గురించే కాకుండా ఇతరుల ఆరోగ్యాన్నీ దృష్టిలో ఉంచుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని వాళ్లకు తెలుస్తుంది.
- ఇంటర్వ్యూ సమయంలో... ప్రస్తుతం కరచాలనం చేయలేనుగానీ మిమ్మల్ని కలవడం నాకెంతో సంతోషంగా ఉందని చెప్పండి. శానిటైజర్‌తో ఇంటర్వ్యూకు ముందు చేతులు శుభ్రం చేసుకోవడం మరువకండి.
- ఇంటర్వ్యూ ఆధారంగానే ఉద్యోగుల భద్రత విషయంలో సంస్థ ఎలా స్పందిస్తుందో గమనించవచ్చు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని వీడియో ఇంటర్వ్యూకు అంగీకరిస్తే... భవిష్యత్తులో మీకు ఇంటి నుంచే పనిచేసే అవకాశాన్ని కూడా కల్పించవచ్చు.
మరి ఇంకెందుకు ఆలస్యం…ఆలోచన.. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని ధైర్యంగా ఇంటర్వూలకు సిద్ధమవ్వండి. విజయీభవ…ఆల్ ది బెస్ట్..
ఇవీ చదవండి: కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయా? సీఎం జగన్ ఏమన్నారు?