నెల్లూరు జిల్లా ఏపీ టూరిజం కార్యాలయంలో మహిళా ఉద్యోగిపై దాడిని జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. బాధ్యులపై చేపట్టిన చర్యలకు సంబంధించి నివేదిక సమర్పించాలని.. డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు జాతీయ మహిళా కమిషన్ లేఖ రాసింది. దివ్యాంగురాలైన ఉద్యోగిపై దాడి దిగ్భ్రాంతి కలిగించిందని ఎన్‌సీడబ్ల్యూ పేర్కొంది. ఘటనపై వీలైనంత త్వరగా నివేదిక ఇవ్వాలని డీజీపీకి రాసిన లేఖలో ఆదేశించింది.
ఇవీ చదవండి: మహిళా ఉద్యోగిపై దాడి జరిగిన 4 రోజులకా స్పందించేది?: సోమిరెడ్డి